Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రభసపై 'దేశం' శ్రేణులకు సమాచారం?

రభసపై 'దేశం' శ్రేణులకు సమాచారం?

రభస సినిమాపై మళ్లీ తెలుగుదేశం పార్టీ అభిమానుల సమాచార పంపిణీ ప్రారంభమైందా? అలా అని గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం శ్రేణులు ఆ సినిమా చూడక్కరలేదంటూ మౌఖిక సమాచారం వ్యాపిస్తోందని  పలువురు అంటున్నారు. అయితే ఇది నిజమా కాదా అన్నది తెలియడం లేదు కానీ, తెలుగుదేశం పార్టీ, దానికి మద్దతు ఇచ్చే సామాజికవర్గం మాత్రం ఎన్టీఆర్ పై తమ కోపాన్ని ఇంకా తగ్గించుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ తెలివైనవాడై వుంటే, రభస సినిమా స్పెషల్ షో అరేంజ్ చేసి, నందమూరి కుటుంబంతో పాటు నారా కుటుంబాన్ని కూడ పిలిచి ప్యాచప్ కోసం ప్రయత్నించినా, లేదా అయిందన్న ఫీల్ తీసుకువచ్చినా బాగుండేదని జూనియర్ అభిమానులు భావిస్తున్నారు. మెగా హీరొలు హిట్ లు కొడుతుంటే, ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల కారణంగా వెనకపడిపోవడం వారికి బాధకలిగిస్తోంది. 

నిజానికి ఈ తరంలో మంచి వాచకం, నటన, విగ్రహం వున్న హీరోల్లో ఎన్టీఆర్ ముందు స్థానంలో వుంటారు. కానీ ఆయనను దురదృష్టం వెన్నాడుతోందో, లేక ఆయన సరైన విధంగా వ్యూహరచన చేయలేకపోతున్నారో తెలియదు కానీ, వీర హైప్ రావాల్సిన సమయంలో సరైన పబ్లిసిటీ కరువై సినిమా క్రేజ్ అంతంత మాత్రంగా వుంటోంది. దానికి తోడు ఇలాంటి సమాచార వ్యాప్తి కాస్త గట్టి ప్రభావమే చూపిస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?