Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'రభస' రసాభాసకు కారణం ఎన్టీఆరేనా?

'రభస' రసాభాసకు కారణం ఎన్టీఆరేనా?

రభస సినిమా కథ అలా తయారు కావడానికి, సినిమా ఒకలా ప్రారంభమై మరోలా ముగియడానికి కారణం కథానాయకుడు ఎన్టీఆరేనా? ఈ మేరకు వదంతులు టాలీవుడ్ లో  షికారు చేస్తున్నాయి. రభస సినిమా ఫలితం అంతా ఎన్టీఆర్ స్వయంకృతాపరాధమని అంటున్నారు. డైరక్టర్ సిక్ అయినపుడు ఎన్టీఆర్ సినిమాను ముందుకు నడిపించారని, అలాగే సినిమా కథను తన చిత్తానికి బృందావనం ఛాయల్లోకి మార్చేసారని అంటున్నారు. 

అక్కడితో ఆగకుండా సినిమా పూర్తయిన తరువాత తన సన్నిహితులైన దర్శకులకు చూపించి, రీ ఎడిట్ చేయించారని మరో టాక్. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ సినిమా విడుదలకు ముందే ఇదంతా తనకు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలకు చెప్పి, తరువాతి సినిమాలకు బెర్త్ కన్ ఫర్మ్ చేసుకున్నాడని కూడా అంటున్నారు. అందుకే బన్నీ అందరికన్నా ముందుగా తానే చేస్తానని పక్కా హామీ ఇచ్చాడంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?