Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రామ్ చరణ్ ఎందుకలా?

రామ్ చరణ్ ఎందుకలా?

ధృవ సినిమా ప్రచారానికి సంబంధించి ఎట్టకేలకు హీరో రామ్ చరణ్ మీడియా ముందుకు వచ్చారు. కానీ ఆ వచ్చిన తీరు, మాట్లాడిన తీరుపై మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ బుధవారం రాత్రి బయల్దేరి అమెరికా వెళ్తున్నారు. అంతకు ముందు ఆయన చాలా బిజీగా వున్నారు. 

కనీసం చానెళ్లకు ఇంటర్వూలు ఇవ్వడం, ప్రింట్ అండ్ వెబ్ మీడియాకు సామూహిక పేరంటం టైపు ప్రెస్ మీట్ పెట్టడం అన్నది అనివార్యం అయింది. ఆఖరికి బుధవారం ఉదయం ప్రింట్ అండ్ వెబ్ మీడియాకు టైమ్ కేటాయిస్తూ మెసేజ్ లు వెళ్లాయి. కానీ అంతలోనే పోస్ట్ పోన్ అంటూ, తరువాత టైమ్ తరువాత చెబుతామంటూ మళ్లీ మెసేజ్. కారణం ఏమిటా అని ఆరా తీస్తే, చానెళ్ల ఇంటర్వూలు కీలకం అని, అవి ముందు ఫినిష్ చేయాలని డిసైడ్ అయినట్లు బోగట్టా తెలిసింది. 

ఆఖరికి సాయంత్రం నాలుగు గంటలకు చరణ్ ప్రెస్ మీట్ ఫర్ ప్రింట్ అండ్ వెబ్ మీడియాకు ఫిక్సయింది.కానీ చరణ్ ఎంతకూ రాలేదు. మీడియా జనాలు గంట సేపు ఓపిగ్గా చూసారు. ఇక వెళ్లిపోదామని అనుకునే లోగా చరణ్ వచ్చారు. కానీ అక్కడ మీడియాతో గడిపిన అరగంట కూడా ఏదో మొక్కుబడిగానే వున్నారు. అడిగిన వాటికి అలా అలా జస్ట్ ఫార్మల్ సమాధానాలు ఇచ్చేసారు తప్ప, హుషారు కనిపించలేదు. ఇదంతా అమెరికా ప్రయాణం హడావుడి కావచ్చు అని మీడియా సరిపెట్టుకుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?