Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

‘సింహం’ గర్జించింది

‘సింహం’ గర్జించింది

ఏదైనా డైలాగు చెప్పాలంటే నందమూరి వారి తరువాతే..నారా వారి వల్ల కాదు. లయన్ బాలకృష్ణ ఏమన్నారు? ‘’...వంద కోట్లు ముష్టిపడేసి, పోలవరం కట్టుకోమంటే ఎలా?’...ఇదీ డైలాగంటే...రాజకీయలే ఆహారంగా బతికేవారి వల్ల కాదు ఇలా చెప్పడం. 

అందుకే బాలయ్య నోట వచ్చిందీ మాట. ప్రత్యేక హొదాపై వేరే రాష్ట్రాలకు లేని సమస్య ఆంధ్రకు వచ్చిందా..ఇది రెండో డైలాగు. ఇదీ పంచ్ పటాకానే...ఇప్పటికైనా స్పందించి ఆంద్రకు న్యాయం చేయాలి..లేదంటే తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటే, జనం తిరగబడతారు...జాగ్రత్త....

ఇది ఫినిషింగ్ అంటే..ఎంతయినా సీమ ఎమ్మెల్యే..సినిమా హీరో..మరి ఇలాంటి డైలాగులు రాకుంటే మరి ఇంకేం వస్తాయి..శభాష్ బాలయ్యా..ఇదే మాట మీద, ఆ విధంగా ముందుకు వెళ్లండి..వచ్చే బడ్జెట్ లో కూడా ఇలాగే వుంటే, అప్పుడు ఆలోచిద్దాం.

అవును..ఇంతకీ పవన్ కు బదులుగా నందమూరి నట సింహాన్ని ఢిల్లీ  తీసుకెళ్లచ్చుగా బాబు గారు..ఘర్చించి నిధులు తెచ్చుకొస్తారు. అయినా బాబుకు పెరటి చెట్లు పనికిరావేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?