Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సార్‌ రేంజ్‌ పెరిగిపోద్దట

సార్‌ రేంజ్‌ పెరిగిపోద్దట

షూటింగ్‌ పూర్తయి చాలా కాలమవుతున్నా కానీ ఇంకా రిలీజ్‌ కాని ‘కార్తికేయ’ చిత్రం ఆగస్ట్‌ 1న రిలీజ్‌ అవుతుందని వార్తలొచ్చాయి. అయితే ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని హీరోగా నిఖిల్‌ తెలియజేసాడు. ఇంకా సెన్సార్‌ కాపీ సిద్ధం కాలేదని, ఆగస్ట్‌ రెండవ వారం తర్వాత ఈ చిత్రం రిలీజ్‌ కావచ్చునని చెప్పాడు. 

మామూలుగా చిన్న సినిమాలకి బిజినెస్‌ జరగకపోవడం వలనో, లేదా మరేదైనా ఆర్థిక ఇబ్బందుల వల్లో రిలీజ్‌ డిలే అవుతుంది. కానీ కార్తికేయ చిత్రానికి అన్ని ఏరియాల్లో బిజినెస్‌ ఎప్పుడో క్లోజ్‌ అయిపోయింది. అయితే దీంట్లో గ్రాఫిక్స్‌ వర్క్‌ చాలా ఉండడం వల్ల ఇది లేట్‌ అవుతోందని తెలిసింది. 

ఈ థ్రిల్లర్‌ మూవీ ట్రెయిలర్‌తోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. స్వామిరారాతో ఘన విజయం సాధించిన నిఖిల్‌ ఈ చిత్రంపై నమ్మకంతో ఇది రిలీజ్‌ అయ్యే వరకు మలి చిత్రం చేయకుండా వేచి చూస్తున్నాడు. ఈ చిత్రంతో హీరోగా తన రేంజ్‌ పెరుగుతుందని నిఖిల్‌ నమ్మకం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?