Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సైరాకు భారీ ఆఫర్?

సైరాకు భారీ ఆఫర్?

ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతూనే వున్నాయి మెగాస్టార్ తాజా సినిమాకు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత గాథ ఆధారంగా తయారయ్యే ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. అందుకే ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఈ సినిమాకు ఓ భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

సినిమా టోటల్ డిజిటల్ కంటెంట్ ను తీసుకునేందుకు అమెజాన్ సంస్థ ముందుకు వచ్చిందని తెలుస్తోంది. కేవలం సినిమా మాత్రమే కాకుండా, షూటింగ్ దశలో వర్కింగ్ విడియోలు, మేకింగ్ విడియోలు, టీజర్, ట్రయిలర్ ఇలా టోటల్ గా డిజిటల్ కంటెంట్ అంతా ఇస్తే, భారీ మొత్తం చెల్లించేందుకు ఆ సంస్థ ముందకు వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఇంకా ఇది ఆఫర్ దశలోనే వుంది. ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నందున, ఒకసారి అన్నీ పూర్తి చేసుకుని, షెడ్యూళ్లు రెడీ అయిన తరువాత కానీ బిజినెస్ వ్యవహారాల మీద దృష్టి పెట్టే ఆలోచన నిర్మాత రామ్ చరణ్ చేయడం లేదని తెలుస్తోంది. ఏమైనా అమెజాన్ సంస్థ ఇలా ముందుకు వచ్చిందంటే, నిర్మాణ వ్యయంలో కనీసం ఇరవై శాతం అన్నా కవర్ అయిపోతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?