Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

టెంప‌ర్ - మ‌రో బొబ్బిలిపులి

టెంప‌ర్ - మ‌రో బొబ్బిలిపులి

టెంప‌ర్ కోసం పూరి జ‌గ‌న్నాథ్ హై ఓల్టేజ్ క్లైమాక్స్‌ని ప్లాన్ చేశాడ‌ట‌ని టాక్‌. ఇది కోర్టు సీన్ అని తెలిసింది. న్యాయ‌మూర్తి - ఎన్టీఆర్‌ల మ‌ధ్య వాదోప‌వాదాలు చాలా తీవ్ర స్థాయిలో సాగుతాయిట‌. 

ఎన్టీఆర్ కోర్టు సీన్‌.. అంటే చాలామందికి, మ‌రీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి 'బొబ్బిలిపులి' కోర్టు సీన్లే గుర్తొస్తాయి. అందులో ఎన్టీఆర్ సంభాష‌ణ‌లు ఇప్పటికీ ఫ్యాన్స్‌నెమ‌రు వేసుకొంటుంటారు. ఆస్ఫూర్తితోనే పూరి ఈ త‌ర‌హా క్లైమాక్స్‌ని రాసుకొన్నాడ‌ని తెలుస్తోంది. 

పోలీసు వ్యవ‌స్థ‌, చ‌ట్టం, న్యాయంల‌పై పూరి త‌న‌దైన శైలిలో వ్యంగ్యోక్తులు విసిరాడ‌ట‌. ఈ డైలాగుల‌న్నీ థియేట‌ర్లో ద‌ద్దరిల్లిపోతాయ‌ని టాక్‌. సాధార‌ణంగా క్లైమాక్స్ అంటే భారీ పోరాటాలూ, ఛేజింగులే. వాటికి ఇది బోన‌స్ అన్నమాట‌.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?