Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వర్మ రివర్స్ గేర్

వర్మ రివర్స్ గేర్

సినిమాలకు అసిస్టెంట్, అసోసియేట్, కో డైరక్టర్ ఓ ఆర్డర్ వుంటుంది. ఎక్కడో రామ్ గోపాల్ వర్మ వంటి గొప్ప వాళ్లు మాత్రమే డైరక్ట్ గా డైరక్టర్లయిపోతారు. ఈ జనరేషన్ లో మాత్రం కొత్తగా మరో లైన్ ఆఫ్ ఆర్డర్ కూడా వచ్చింది. షార్ట్ ఫిలిం తీయడం..దాన్ని చూపించి, డైరక్షన్ చాన్స్ పట్టడం. అంటే షార్ట్ ఫిలిమ్ ప్రారంభం..చిన్న సినిమా ఆ పై పెద్ద  సినిమా ఇలా..ఇదే ప్రమోషన్ అనుకోవాలి. 

మరి ఈ లెక్కన చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ రివర్స్ లో ప్రయాణిస్తున్నారని అనుకోవాలి. ఏ అనుభవం లేకుండా నాగ్ వంటి స్టార్ తో సినిమా చేసేసారు. బాలీవుడ్ వెళ్లి అమితాబ్ లాంటి లెజెండ్ ను డైరక్ట్ చేసారు. అన్నీ అయిపోయాయి. ఇప్పడు చిన్న సినిమాలకు దిగారు. అక్కడితో ఆగలేదు..షార్ట్ ఫిలిమ్ కు దిగారు. అందరూ ఇట్నుంచి అటు వెళ్తుంటే, రామ్ గోపాల్ వర్మ అట్నుంచి ఇటు వస్తున్నారు. ఆయనంతా వెరైటీనే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?