Advertisement

Advertisement

Home > Movies - Reviews

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

నాని వరుస విజయాల పరంపర 'నిన్నుకోరి'తో కూడా కొనసాగింది. నాని చిత్రాల్లోనే అత్యధిక ఓపెనింగ్స్‌ తెచ్చుకున్న ఈ చిత్రం క్లాస్‌ కంటెంట్‌తోనే మాస్‌ ఏరియాల్లోను బ్రహ్మాండమైన వసూళ్లు సాధించింది. అయిదు రోజులు తిరిగే సరికి ఇరవై కోట్ల షేర్‌ సాధించిన ఈ చిత్రం సూపర్‌హిట్‌ దిశగా సాగుతోంది.

రెండవ వారంలో ఛాలెంజ్‌ చేసే పెద్ద సినిమా ఏదీ లేకపోవడం వల్ల ఈ చిత్రం ఈజీగా ముప్పయ్‌ కోట్ల షేర్‌ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రతి సినిమాతోను నటుడిగా తన ప్రతిభ చూపించడమే కాకుండా, స్టార్‌గా కూడా సత్తా చాటుకుంటోన్న నాని 'నిన్నుకోరి' విజయంతో మరో మెట్టు పైకెక్కాడు. అతని తదుపరి చిత్రాలకి ఇప్పుడు ఇంకా గిరాకీ ఏర్పడింది.

బ్లాక్‌బస్టర్‌ అంటూ ఎంత గీ పెట్టినా కానీ 'దువ్వాడ జగన్నాథమ్‌' చివరకు బయ్యర్లకి నష్టాలే మిగిల్చింది. చాన్నాళ్ల తర్వాత అల్లు అర్జున్‌ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర ఫెయిలైంది.

ఈవారం జగపతిబాబు చిత్రం 'పటేల్‌ సర్‌'తో పాటు నలుగురు హీరోల 'శమంతకమణి' రిలీజైంది. ఇప్పట్నుంచి ప్రతి శుక్రవారం ఏదో ఒక చెప్పుకోతగ్గ చిత్రం రిలీజ్‌ అవుతుంది కనుక కొత్తగా వచ్చే చిత్రాలన్నీ మంచి టాక్‌ తెచ్చుకోకపోతే మూడు రోజుల ముచ్చటగా మిగిలిపోతాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?