Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

రాజ్‌ తరుణ్‌కి ప్రేక్షకుల్లో ఏర్పడ్డ గుడ్‌విల్‌ 'అంధగాడు' చిత్రానికి డీసెంట్‌ ఓపెనింగ్‌ తెచ్చిపెట్టింది. మాస్‌ ఫ్రెండ్లీ ట్రీట్‌మెంట్‌, స్క్రీన్‌ప్లే వల్ల ఈ చిత్రం సింగిల్‌ స్క్రీన్స్‌లో బాగానే పర్‌ఫార్మ్‌ చేస్తోంది. రాజ్‌ తరుణ్‌ గత రెండు చిత్రాల్లానే ఇది కూడా నిర్మాతకి, బయ్యర్లకి లాభదాయకమవుతుందని ట్రేడ్‌ చెబుతోంది.

'రారండోయ్‌ వేడుక చూద్దాం' అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థలో మరో విజయంగా నిలిచింది. అయితే ఈ చిత్రంతో నాగచైతన్య ఆశించిన భారీ స్థాయి విజయం మాత్రం దక్కలేదు. ప్రస్తుతానికి షేర్స్‌ మీద రన్‌ అవుతోన్న ఈ చిత్రం ఫుల్‌ రన్‌లో పాతిక కోట్ల షేర్‌కి అటు ఇటుగా సాధిస్తుందని అంచనా.

గతవారం విడుదలైన వంశీ చిత్రం 'ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌' డిజాస్టర్‌ అయింది. కనీసం ఓపెనింగ్స్‌ కూడా రాని ఈ చిత్రాన్ని మొదటి మూడు రోజుల్లోనే చాలా చోట్ల నెట్‌ ఫ్రీ బేసిస్‌లో రన్‌ చేసుకోవాల్సి వచ్చింది. ఈవారం రెండు కొత్త చిత్రాలు రిలీజ్‌ అయ్యాయి. ఆరడుగుల బుల్లెట్‌, అమీతుమీ చిత్రాలు 'దువ్వాడ జగన్నాథమ్‌' రిలీజయ్యే వరకు బాక్సాఫీస్‌ని బిజీగా వుంచుతాయేమో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?