Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

గత వారం విడుదలైన లో బడ్జెట్‌ చిత్రం 'అమీ తుమీ' డీసెంట్‌ కలక్షన్స్‌తో రన్‌ అవుతోంది. ముఖ్యంగా ఏ సెంటర్స్‌లో ఈ కామెడీకి మంచి వసూళ్లు వస్తున్నాయి. వెన్నెల కిషోర్‌ కామెడీ హైలైట్‌గా నిలిచిన ఈ చిత్రం నిర్మాతలకి మంచి లాభాలే తెచ్చి పెడుతుందని ట్రేడ్‌ టాక్‌.

గోపీచంద్‌ నటించిన 'ఆరడుగుల బుల్లెట్‌' చివరి నిమిషంలో వాయిదా పడడంతో 'అంధగాడు', 'రారండోయ్‌ వేడుక చూద్దాం' చిత్రాలు లాభపడ్డాయి. 'అంధగాడు' రెండవ వారంలోను షేర్స్‌ మీద రన్‌ కాగా, 'రారండోయ్‌ వేడుక చూద్దాం' బయ్యర్లకి మరిన్ని లాభాలొచ్చాయి. బాహుబలి 2 యాభై రోజుల రన్‌ పూర్తి చేసుకుంది.

ఈ వారంలో కూడా చెప్పుకోతగ్గ సినిమా లేకపోవడంతో మార్కెట్లో వున్న సినిమాలు క్యాష్‌ చేసుకోవడానికి ఇంకో వీకెండ్‌ దొరికింది. మార్కెట్లో పెద్ద సినిమాలు లేని కారణంగా ప్రస్తుతం డల్‌గా నడుస్తోన్న సినిమా వ్యాపారం 'దువ్వాడ జగన్నాథమ్‌' రాకతో మళ్లీ ఊపందుకుంటుందని ఆశిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?