Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

గత వారం విడుదలైన ఒక్క క్షణం నిరాశ పరిచింది. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' దర్శకుడు విఐ ఆనంద్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ అల్లు శిరీష్‌ చిత్రం విడుదలకి ముందు బాగానే ఆకర్షించింది. అయితే అల్లు శిరీష్‌కి పుల్‌ లేకపోవడంతో ఈ థ్రిల్లర్‌ బాగా స్ట్రగుల్‌ అవుతోంది. మొదటి వారంలో నామ మాత్రపు వసూళ్లు మాత్రమే వచ్చిన ఈ చిత్రం ఇక సేఫ్‌ అవడం అసాధ్యమని ట్రేడ్‌ చెబుతోంది.

దీంతో పాటే విడుదలైన సునీల్‌ చిత్రం '2 కంట్రీస్‌' అతనికి మరో షాక్‌ ఇచ్చింది. సునీల్‌ ఖాతాలో అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచిన ఈ చిత్రంతో హీరోగా నిలబడాలనే సునీల్‌ ఆశలపై నీళ్లు చల్లేసినట్టయింది. ఇక ఎంసిఏ రెండవ వారంలోను అదరగొట్టింది. కొత్త సినిమాలు సవాల్‌ చేయలేకపోవడంతో సెకండ్‌ వీకెండ్‌ కూడా నాని డామినేషన్‌ కొనసాగింది.

న్యూ ఇయర్‌ హాలిడేతో సహా అన్నిటినీ బాగా క్యాష్‌ చేసుకున్న ఈ చిత్రం నానికి మరో సూపర్‌హిట్‌ ఇచ్చింది. ఒకే ఏడాదిలో మూడు సూపర్‌హిట్లు ఇచ్చిన హీరోగా నాని అరుదైన రికార్డ్‌ సాధించాడు. ఇక హలో రెండవ వారంలో పూర్తిగా చల్లబడిపోయి భారీ ఫ్లాప్‌ దిశగా సాగుతోంది. విపరీతంగా ఖర్చు పెట్టిన ఈ చిత్రంపై సగం లాస్‌ తప్పదని ట్రేడ్‌ అంటోంది. అఖిల్‌కి హీరోగా మంచి పేరు వచ్చినా కానీ బాక్సాఫీస్‌ వద్ద హలో బోల్తా కొట్టింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?