Advertisement

Advertisement


Home > Sports - Cricket

బోర్‌ కొట్టించేస్తున్న వరల్డ్‌ కప్‌

సౌతాఫ్రికా చేతిలో ఐర్లాండ్‌ చిత్తు. పాకిస్తాన్‌ దెబ్బకు యూఏఈ విలవిల. ఆస్ట్రేలియా ధాటికి చేతులెత్తేసిన ఆప్ఘనిస్తాన్‌.. వరుసగా మూడు మ్యాచ్‌లు చాలా చప్పగా సాగాయి వరల్డ్‌ కప్‌లో. పెద్ద జట్టుతో చిన్న జట్లు తలపడేటప్పుడు పరిస్థితులు ఇలానే వుంటాయి. ఒకటి బిగ్‌ ఫైట్‌, ఇంకొకటి సాదా సీదా ఫైట్‌.. ఒకేరోజు వుంటే కాస్తయినా కిక్‌ వుంటుందేమోగానీ, ఒకేరోజు చప్పగా సాగే రెండు మ్యాచ్‌లను చూడాలంటే క్రికెట్‌ అభిమానులకి నీరసం వచ్చేయడం ఖాయం.

రెండు పెద్ద టీమ్‌లు తలపడినప్పుడే మ్యాచ్‌ ఏకపక్షంగా సాగితే చిరాకొచ్చేస్తుంటుంది. రెండు జట్లూ హోరాహోరీగా తలపడితేనే క్రికెట్‌లో అసలు సిసలు మజాని క్రికెట్‌ అభిమానులు ఎంజాయ్‌ చేస్తారు. చిన్న జట్లు మరీ సింపుల్‌గా చేతులెత్తేస్తుండడంతో, పెద్ద జట్లు రికార్డు విజయాల్ని నమోదు చేసేస్తున్నాయి. పాకిస్తాన్‌తో యూఏఈ తలపడ్డ మ్యాచ్‌లో అయితే, పాక్‌ బ్యాట్స్‌మెన్‌ చెలరేగిపోయారు. ఈ సిరీస్‌లో పాక్‌ బ్యాటింగ్‌ పరంగా బాగా ఆడిన మ్యాచ్‌ ఇదే.

ఇక, సౌతాఫ్రికా విషయానికొస్తే, అస్సలు దయాదాక్షిణ్యాలేమీ చూపకుండా ఐర్లాండ్‌ని చితకబాదేసింది. ఆస్ట్రేలియా, ఆఫ్గనిస్తాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఆసీస్‌ ఆటగాళ్ళు చెలరేగిపోయారు. ‘పసికూన’ అన్పించుకుంటున్న జట్లు, పులి పంజా దెబ్బకి విలవిల్లాడిపోతుంటే, ఆ మ్యాచ్‌ చూడాలని ఎవరు మాత్రం అనుకుంటారు.? వ్యూయర్‌షిప్‌ బాగా పడిపోయిందట ఈ మ్యాచ్‌లకి. ఎంత దారుణంగా అంటే, నిర్వాహకులు ఊహించనంతగా.

వరుసగా బోర్‌ కొట్టించే మ్యాచ్‌లు చూడాల్సి వస్తే, రసవత్తరంగా సాగే మ్యాచ్‌ల పట్ల కూడా సగటు క్రికెట్‌ అభిమాని ఇంట్రెస్ట్‌ చూపించకపోవచ్చు. అదే జరిగితే, చప్పగా సాగిన వరల్డ్‌ కప్‌గా 2015 వరల్డ్‌ కప్‌ పోటీలు మిగిలిపోయే ప్రమాదముంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?