Advertisement

Advertisement


Home > Sports - Cricket

క్రికెట్‌ని బజార్న పడేస్తున్న ఐపీఎల్‌

క్రికెట్‌ని బజార్న పడేస్తున్న ఐపీఎల్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ద్వారా ఇండియాలోని యంగ్‌ క్రికెటర్ల టాలెంట్‌ని వెలికి తీయాలన్నది భారత క్రికెట్‌ పెద్దల ఆలోచన. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే ఐపీఎల్‌ని లాంఛ్‌ చేశారు. ఎనిమిదో సీజన్‌ నడుస్తోందిప్పుడు. గత ఏడు సీజన్లలో అనేక వివాదాలు తెరపైకొచ్చినా, కాసుల గలగలల మధ్య ఆ వివాదాలు సద్దుమణిగిపోయాయి. ఫిక్సింగ్‌లు, ఆటగాళ్ళ మధ్య గొడవలు.. అబ్బో.. ఒకటేమిటి, ఇండియాలో క్రికెట్‌ విలువల్ని సర్వనాశనం చేసేసింది ఐపీఎల్‌.

ఇంతకీ, ఎంతమంది యంగ్‌ క్రికెటర్స్‌ ఐపీఎల్‌ ద్వారా టీమిండియాలో చోటు దక్కించుకున్నారు.? వారి వల్ల టీమిండియా కీర్తి ప్రతిష్టలు ఎంతవరకు పెరిగాయి.? అని ఒక్కసారి లెక్కలు తీస్తే, ప్చ్‌.. అంత సీన్‌ లేదన్న వాదన క్రికెట్‌ పండితుల నుంచి వ్యక్తమవుతుంది. క్రికెట్‌ పేరు చెప్పి కోట్ల రూపాయలు ఆర్జించడానికి మాత్రం ఐపీఎల్‌ భలేగా ఉపకరిస్తోంది. క్రికెటర్లు స్టార్లుగా, సూపర్‌ స్టార్లుగా మారేలా ఐపీఎల్‌ చేస్తోందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు.

ఇక, తాజాగా నిన్న బెంగళూరు, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆటగాడు పోలార్డ్‌, నోటికి ప్లాస్టర్‌ వేసుకున్నాడు. అంపైర్‌ తనను మైదానంలో హెచ్చరించడంతో పోలార్డ్‌ ఇలా నిరసన వ్యక్తం చేశాడు. వినడానికి, మైదానంలో చూడ్డానికీ ఫన్నీగా వున్నా క్రికెట్‌ చరిత్రలోనే మాయని మచ్చ ఈ సంఘటన. మైదానంలో అంపైర్‌ నిర్ణయాలకి విలువ లేకుండా పోతోంది ‘రివ్యూ’ సిస్టమ్‌ పుణ్యమా అని. ఇప్పుడేమో, ఆటగాళ్ళు నిరసన వ్యక్తం చేసేస్తున్నారు.

రాజకీయాల్లో నిరసనలు సర్వసాధారణం. ఆ నిరసనలు అత్యంత పతన స్థాయికి చేరి, రాజకీయాల్లో విలువల్ని దిగజార్చేశాయి. పోలార్ట్‌ వ్యవహారాన్ని లైట్‌ తీసుకుంటే, క్రికెట్‌ మైదానంలో రాజకీయాలు, ఇంకా ఛండాలంగా తయారవుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.

అయితే, ఐపీఎల్‌.. మీడియాకి పండగ. ఐపీఎల్‌ యంగ్‌ స్టర్స్‌కి పండగ.. ఐపీఎల్‌ క్రికెటర్లకి పండగ.. ఐపీఎల్‌ సెలబ్రిటీలకు పండగ.. ఐపీఎల్‌.. బెట్టింగ్‌రాయళ్ళకి పండగ.. అందరికన్నా మిన్నగా ఐపీఎల్‌ బీసీసీఐకి పండగ.. ఇన్ని పండగల నడుమ, క్రికెట్‌ ఎలా నాశనమైపోతే ఎవరికి నస్టం.?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?