Advertisement

Advertisement


Home > Special News - Spiritual Talk

విద్వేష విషబీజం

విద్వేష విషబీజం

ఓ వ్యక్తిపై ఇంకో వ్యక్తి అసహనం పెంచుకుంటూ పోతే, పుట్టేది విద్వేషమే. ఆ విద్వేషానికి భాష ప్రాతిపదిక కావొచ్చు, ప్రాంతం ప్రాతిపదిక కావొచ్చు, రాష్ట్రం, దేశం ప్రాతిపదికలు కావొచ్చు... ఇంకేదైనా కావొచ్చుగాక.! విద్వేషం అనే మాటల్లో 'చిన్న, పెద్ద' అన్న తేడాలుండవు. ఏదైనా విద్వేషమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. తెలంగాణ ఉద్యమం గట్టిగా జరుగుతున్న సమయంలో, రాజకీయ నాయకులు ఏం చేశారు.? తమ రాజకీయ మనుగడ కోసం విద్వేషాల్ని రగిల్చారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చురేపారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజా ప్రతినిథుల్ని చితక్కొడితే, యూనివర్సిటీల సాక్షిగా సాధారణ పౌరుల్ని పరుగులు పెట్టించారు. ఇదీ విద్వేషమే. కానీ, ఉద్యమం ముసుగులో జరిగింది. 'అది ప్రజాస్వామిక ఆకాంక్ష.. అణగదొక్కబడిన ఆకాంక్ష.. దాన్ని బయటపెట్టే క్రమంలో అసహనం మామూలే.. దాన్నిప్పుడు అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు..' అనే వాదనలున్నాసరే, 'విద్వేష పంచాయితీ'కి ముగింపు వుండదుగాక వుండదన్న సంకేతాల్ని రాజకీయ నాయకులు ఇంకా పంపుతూనే వున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?