ఫ్రాచీని ఫిక్స్ చేసారట

మొత్తానికి ముందే ఫీలర్ బయటకు వచ్చినట్లే, హీరో సునీల్ సరసన ప్రాచీ దేశాయ్ ను ఫిక్స్ చేసారు. వర్మ ఏకలవ్య శిష్యుడు వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో, ప్రేమకథాచిత్రమ్ నిర్మాత సుదర్శన్ రెడ్డి ఓ సినిమాను…

మొత్తానికి ముందే ఫీలర్ బయటకు వచ్చినట్లే, హీరో సునీల్ సరసన ప్రాచీ దేశాయ్ ను ఫిక్స్ చేసారు. వర్మ ఏకలవ్య శిష్యుడు వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో, ప్రేమకథాచిత్రమ్ నిర్మాత సుదర్శన్ రెడ్డి ఓ సినిమాను నిర్మిస్తున్నారు. 

దాంట్లో సునీల్ హీరో. హీరోయిన్ వేట సాగించి, ఆఖరికి ప్రాచీ దేశాయ్ ను ఫిక్స్ చేసేసారు. ఆ మధ్య కాస్త డల్ అయిన సునీల్ ఇప్పుడు చకచకా సినిమాలు ఒకె చేసాడు. వాసు వర్మ సినిమా షూటింగ్ లో వుంది. ఇప్పుడీ సినిమా రెడీగా వుంది. మరో రెండు కూడా ఆల్మోస్ట్ కన్ ఫర్మ్ స్టేజ్ లో వున్నాయట.