థమన్..ఇది నిజమేనా?

ధమన్ కు. దేవీ శ్రీ ప్రసాద్ కు ఓ అలవాటు వుంది. హీరోల చేత పాటలు పాడించేయడం. ఇప్పుడు అదే అలవాటును బాలయ్య డిక్టేటర్ సినిమాకు  కూడా అమలు చేస్తే ఎలావుంటుంది అని ఆలోచిస్తున్నాడట…

ధమన్ కు. దేవీ శ్రీ ప్రసాద్ కు ఓ అలవాటు వుంది. హీరోల చేత పాటలు పాడించేయడం. ఇప్పుడు అదే అలవాటును బాలయ్య డిక్టేటర్ సినిమాకు  కూడా అమలు చేస్తే ఎలావుంటుంది అని ఆలోచిస్తున్నాడట థమన్. ఆ మధ్య స్టేజ్ పై బాలయ్య పాటలు పాడిన సీన్ జనాలకు గుర్తుండే వుంటుంది. 

శ్రీవాస్ దరకత్వంలో కోన వెంకట్ అండ్ కో రూపొందిస్తున్న సినిమా డిక్టేటర్. ఈ సినిమాకు థమన్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. అయితే తన అలవాటు ప్రకారం బాలయ్య చేత ఈ సినిమాలో పాట పాడిస్తే ఎలా వుంటుదా అని థమన్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఆ మధ్య హుద్ హుద్ కార్యక్రమంలో బాలయ్య స్టేజ్ పై తన గొంతు సవరించుకోవడం చూసి థమన్ కు ఈ అయిడియా వచ్చి వుంటుంది. కానీ బాలయ్య ఓకె అంటారా అన్నది చూడాలి. అంజలి ఓ హీరోయిన్ కాగా, సోనాలి చౌహాన్ మరో హీరోయిన్ గా ఎంపికయింది.