రెజీనా బిజీ అవుతోంది

రకుల్, రెజీనా దాదాపు ఒకసారే ఫీల్డులోకి వచ్చారు. కానీ రకుల్ రేస్ లో ముందుకు దూసుకుపోయింది. రెజీనా కూడా మంచి లుక్స్, మంచి నటన వున్నా కాస్త వెనక పడింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ…

రకుల్, రెజీనా దాదాపు ఒకసారే ఫీల్డులోకి వచ్చారు. కానీ రకుల్ రేస్ లో ముందుకు దూసుకుపోయింది. రెజీనా కూడా మంచి లుక్స్, మంచి నటన వున్నా కాస్త వెనక పడింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అయిపోతోంది. 

ఆల్రెడీ సాయిధరమ్ తేజ పక్కన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో చేస్తోంది. ఇప్పుడు రవికుమార్ చౌదరి-గోపీచంద్ కాంబినేషన్ లో నిర్మించే సినిమాకు కూడా ఓకె అయింది. మరోపక్క తన మాతృభాష తమిళంలో ఒకటి రెండు సినిమాలు సైన్ చేసింది. 

అంతకు ముందు పూర్తి చేసిన నారా రోహిత్ శంకర సినిమా విడుదల కావాల్సి వుంది. తెలుగు తెరకు హీరోయిన్ల కొరత చాలా వుంది. అందుకే ఇప్పుడు మళ్లీ రెజీనా టర్న్ వచ్చినట్లుంది. కానీ టాప్ రేంజ్ హీరోల దృష్టి మాత్రం ఆమెపై పడడం లేదు ఎందుకో?