సన్నీలియోన్ మీద ఆ మధ్య రాఖీసావంత్, ‘దేశం నుంచి తరిమేస్తా’ అంటూ కామెంట్ చేసిన విషయం విదితమే. తన ఇల్లుని సన్నీలియోన్ దంపతులకు అద్దెకిచ్చిన సెలీనా జైట్లీ కూడా సన్నీలియోన్‌పై నోరు పారేసుకుంది. ఈ రెండు వివాదాలపై స్పందించిన సన్నీలియోన్ సింపుల్‌గా ‘యూజ్లెస్ కామెంట్స్’ అనేసింది.
బాలీవుడ్లో రాణిస్తున్న తనను చూసి అక్కసుతో ఎవరెవరో ఏవేవో మాట్లాడేస్తున్నారనీ, వారి కామెంట్లపై స్పందించేంత తక్కువ స్థాయి తనది కాదని సన్నీలియోన్ స్పష్టం చేసింది. బాలీవుడ్లో నటిగా తానేంటో నిరూపించుకోవాలనుకుంటున్నానని చెబుతోన్న సన్నీలియోన్, ‘నాతో ప్రొఫెషన్ పరంగా ఎవరైనా పోటీ పడదలచుకుంటే వారిని గౌరవిస్తాను. అంతే తప్ప నా మీద అనవసరమైన కామెంట్స్ చేస్తే ఇకపై ఊరుకునేది లేదు’ అని తేల్చి చెప్పింది.
సన్నీలియోన్ బాలీవుడ్‌లోకి వచ్చినప్పుడు పెద్దగా మాట్లాడేది కాదు. తర్వాత్తర్వాత మాట్లాడటం నేర్చుకుంది. ఇప్పుడేమో మహా మాటకారి అయిపోయింది. దాంతో, ప్రత్యర్థులు ఆమెను ఏమన్నా కామెంట్ చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవడమే మంచిది. బాలీవుడ్లో క్యాట్ ఫైట్ మామూలేగానీ, సన్నీలియోన్‌తో పెట్టుకుంటే మాత్రం సీన్ సితారే. అయినా సన్నీలియోన్ ముందు రాఖీసావంత్ నోరు కూడా తేలిపోతోందంటే కాస్త ఆసక్తికరమైన విషయమే ఇది.