బ్యాంకాక్ లో పూరి రచన

మరోసారి దర్శకుడు పూరి జగన్నాధ్ బ్యాంకాక్ వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాకు డైలాగ్ వెర్షన్ అక్కడ ఆయన రెడీ చేస్తున్నారని వినికిడి. 7న తిరిగి వచ్చి, 9 నుంచి లోఫర్ ప్రారంభించి,…

మరోసారి దర్శకుడు పూరి జగన్నాధ్ బ్యాంకాక్ వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాకు డైలాగ్ వెర్షన్ అక్కడ ఆయన రెడీ చేస్తున్నారని వినికిడి. 7న తిరిగి వచ్చి, 9 నుంచి లోఫర్ ప్రారంభించి, కొద్ది రోజుల తరువాత లొకేషన్ ను జోధ్ పూర్ కు షిఫ్ట్ చేస్తారు. 

ఆగస్టు 20 వరకు అక్కడ చేసి, ఆ వెంటనే వచ్చి చిరంజీవి సినిమా ఓపెనింగ్ చేయాలన్నది పూరి ప్లాన్ గా తెలుస్తోంది. క్లాప్ కొట్టిన తరువాత మళ్లీ లోఫర్ పైకి వెళ్లి, అక్టోబర్ నుంచి చిరంజీవి సినిమా ప్రారంభించాలన్నిది అయిడియా అని తెలుస్తోంది. 

మెగాస్టార్ తో పూరి సినిమా పక్కాగా వుంటుందని ఆయన యూనిట్ జనాల నుంచి వినవస్తున్న మాట. ఇందుకోసమే ఆయన బ్యాంకాక్ వెళ్లి, డైలాగ్ వెర్షన్ కూడా రెడీ చేస్తున్నారట.