శ్రీమంతుడి డబ్బింగ్

మహేష్ శ్రీమంతుడు టాకీ పార్ట్ పూర్తయిపోయింది. డబ్బింగ్ చెప్పడం ప్రారంభించేసాడు హీరో మహేష్ బాబు. చకచకా ఫినిష్ చేసి, షెడ్యూలు ప్రకారం విడుదల చేయాలని సీరియస్ గా వర్క్ చేస్తోంది యూనిట్.  Advertisement చాలా…

మహేష్ శ్రీమంతుడు టాకీ పార్ట్ పూర్తయిపోయింది. డబ్బింగ్ చెప్పడం ప్రారంభించేసాడు హీరో మహేష్ బాబు. చకచకా ఫినిష్ చేసి, షెడ్యూలు ప్రకారం విడుదల చేయాలని సీరియస్ గా వర్క్ చేస్తోంది యూనిట్. 

చాలా కాలం తరువాత మహేష్ బాబు బర్త్ డే మంత్ లో సినిమా విడుదల కావడం మళ్లీ శ్రీమంతుడు తోనే. ఈ సినిమాపై మహేష్ చాలా కాన్ఫిడెన్స్ తో వున్నాడు. పాటలు చాలా సూపర్ గా వచ్చాయని వినికిడి. దేవీశ్రీ ప్రసాద్ చితక్కొట్టేసాడని ఇన్ సైడ్ టాక్. ఈ నెలలోనే అడియో జనాల ముందుకు వస్తుంది.