మాంచి ఖరీదైన ఇల్లు భారీగా కట్టాడు దర్శకుడు శ్రీనువైట్ల. ఇప్పుడు దాన్ని అమ్మాలనుకుంటున్నాడని వదంతి వినిపిస్తోంది. కారణం ఆ ఇంట్లోకి వెళ్లాక ఓ ఫ్లాప్..ఓ డిజాస్టర్ అతని డైరక్షన్ లో రావడమేనంట. పైగా శ్రీనువైట్లకే కాదు, ఆ ఇల్లు వున్న ప్రాంతంలో మరో ఇద్దరి ముగ్గురికి కూడా చాలా దారుణమైన అనుభవాలు వున్నాయట. ఆర్ ఆర్ వెంకట్ ఇల్లు కూడా అక్కడేనట. ఆయన కూడా ఓ రేంజ్ లో సినిమాలు తీసి, పాపం, ఆఖరికి ఇండస్ట్రీకే దూరం అయిపోయారు.
శ్రీను వైట్ల ఇల్లు అక్కడ కడతానన్నపుడే కొందరు వద్దని వారించారని వినికిడి. ఇప్పుడు అమ్ముదామని ప్రయత్నం అంట. కానీ రేటు భారీగా, అనుభవాలు చేదుగా వుండడంతో ఎవరూ అంతగా ముందుకు రావడం లేదని తెలుస్తోంది. అయినా సినిమాలో సరుకు వుంటే, సెంటిమెంట్లు ఏం చేస్తాయి చెప్పండి.