చిరంజీవి కావాలని చేసారో, అనుకోకుండా చేసారో కానీ ఇప్పుడు బన్నీ అభిమానులు పీలవుతున్నారట. రుద్రమదేవి లాంటి చారిత్రాత్మిక సినిమాలో హీరో పాత్ర కాకపోయినా, ముందుకు వచ్చి, రెమ్యూనిరేషన్ కూడా అడక్కుండా చేసాడు బన్నీ. సినిమా కేవలం బన్నీ కారణంగానే బాగానే ఆడింది.
ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. చిరంజీవి గెస్ట్ గా నటించిన బ్రూస్ లీ కన్నా, బన్నీ చిన్న పాత్ర వేసిన రుద్రమదేవి సినిమా బోలెడు వసూళ్లు సాగించింది. రుద్రమదేవికి వాయిస్ ఓవర్ చిరంజీవిదే. మరి అలాంటపుడు బన్నీని అభినందించడమో, అభినందిస్తూ ఓ స్టేట్ మెంట్ పడేయడమో చేయాలి కదా..కానీ అలా చేయలేదు.
నిన్న కాక మొన్న వచ్చిన కంచె సినిమా కు మాత్రం అభినందించాడు. నా కొడుకు సాధించిన విజయం అంటూ గాల్లోకి ఎత్తాడు. మరి మేనల్లుడు సాధించిన విజయం అని ఎందుకు అనలేదు..అంటూ బన్నీ అభిమానులు ఫీలవుతున్నారట.