కలసి దోచుకుందాం రా !

కలసి వ్యాపారాలు చేయటం, కలసి ఇండస్ట్రీలు పెట్టటం, కలసి ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం, కలసి ప్రభుత్వాలు పడగొట్టటం.. ఇవన్నీ మనం చూస్తూనే వున్నాం. ఇప్పుడు ఐకమత్యమే బలం అనే స్లోగన్‌తో కలసి ప్రజల్నీ ప్రభుత్వాలనూ…

కలసి వ్యాపారాలు చేయటం, కలసి ఇండస్ట్రీలు పెట్టటం, కలసి ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం, కలసి ప్రభుత్వాలు పడగొట్టటం.. ఇవన్నీ మనం చూస్తూనే వున్నాం. ఇప్పుడు ఐకమత్యమే బలం అనే స్లోగన్‌తో కలసి ప్రజల్నీ ప్రభుత్వాలనూ దోచుకోవటం లేటెస్ట్ ట్రెండ్. 

ఒక్కడు చేసే దోపిడీని అడ్డుకోవటం అరికట్టడం తేలిక. అదే కొంతమందిఎంతో ఐకమత్యంతో కలసి చేసే దోపిడీలను అడ్డుకోవటం ఎవడివల్లా కాదు.

రాజకీయ నాయకులు ఎప్పటికీ క్రిమినల్స్‌తోనే పాలూ నీరూ లాగా కలసిపోయి దోచుకుంటూంటారు. ఆ స్కీమ్స్ ఇదిగో.. ఇలా ఉంటాయ్.

అరే నర్సింగ్.. గీ లాండ్ మొత్తం మన దోస్త్ రెడ్డీ సాబ్ కబ్జా జేసిండు. దీని ఓనరు విక్రమ రెడ్డిని నీ గాంగ్‌తో ఎటాక్ జేసి లేపెయ్యాల. 
గింతనేనా? రెండు దినాల్ల లేపెస్తానన్నా.     

ఇదిగో.. మనక్కావలసినోడు మైనింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసాడు. అందరి అప్లకషన్స్ పక్కన పెట్టి మనోడిది నువ్వు రికమెండ్ చేయాలి. నీ నోటింగ్ మీద నేను అలాట్ చేస్తా. మనిద్దరం కలిసుంటే సీబీఅయ్ ఓడు మన్నేం పీకలేడు. మనోడు మనకి అయిదొందల కోట్లిస్తాడు. అందులో నీకు వందకోట్లు.

థాంక్యూ సర్..        
xxxxxxxxxxxxxx
హలో.. మాట్లాడేది ముఖ్యమంత్రి గారేనా సార్

వును.. నువ్వెవరు?

సిబీఅయ్ డైరెక్టర్‌ని సార్. బొగ్గు కుంభకోణం కేసులో రేపు మీ ఇల్లూ మీ సన్నిహితుల ఇళ్ళూ రైడ్ చేయాలనుకుంటున్నాం సార్ ? మీకు కన్వీనియెంటేనా?

ఇంత సడెన్గా చెప్తే ఎట్లారా బాబూ?ఆ కేస్‌కి సబంధించిన ఫైల్స్ అన్నీ తగలబెట్టాలి కదా. ఇంట్లో వున్న బ్లాక్ మనీ స్విస్ బాంక్‌కి తరలించాలికదా. మీరు రైడ్ చేసినప్పుడు ఒక్క క్లూ కూడా దొరక్కుండా చూడా లికదా. కనీసం నెలరోజులు టైమివ్వాలి నాకు. 

నేను దోచుకున్న డబ్బులో నీకూ వాటా ఇస్తున్నాకదా.

అలాగే సార్.   

సేఎమ్ గారూ.. మీరడిగిన నెలరోజుల గడువైపోయింది. రేపు మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. 

అలాగా సరే.. అలాగే కానీ.

xxxxxxxxxxxxxxxxxx

హలో.. ఫైవ్ స్టార్ హాస్పిటల్ ఎండీ సేక్సనా గారేనా మాట్లాడేదీ?

అవున్సార్.

నేను చీఫ్ మినిస్టర్ మాట్లాడుతున్నా. మరేంలేదు.. ఒక పెద్ద ఫ్రాడ్ కేసులో రేపు నన్ను అరెస్ట్ చేస్తామంటున్నారు సీబీఅయ్ వాళ్ళు. అరెస్ట్ చేయగానే నాకు గుండె జబ్బో కిడ్నీ జబ్బో వస్తుందికదా. అప్పుడు మీ హాస్పిటల్లో చేరతా. కనీసం ఆరునెలలు నన్ను 
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవకుండా కాపాడాలి. ఇంకాసేపట్లో మీకు వంద కోట్లు మా వాళ్ళు అందజేస్తారు.

వెల్కం సార్. సంవత్సరం అయినా మా హాస్పిటల్లో ఉండవచ్చు.

xxxxxxxxxxxxxxxxxxxxxxx

హలో.. జడ్జ్ గారేనా?

అవును..

నేను. సేఎమ్‌ని మాట్లాడుతున్నా సార్.

మీ ఫోన్ కోసమే చూస్తున్నా. అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ ఇవ్వాలనేగా. మీరేం వర్రీ అవకండి సార్. అంతా నేను చూసుకుంటాగా. మనీ ఎంత పంపుతున్నారు?

వంద కోట్లు. సరిపోతుందా?

చాలుసార్. నాకు డబ్బు మీద ఎప్పుడూ వ్యామోహం లేదు. 

xxxxxxxxxxxx

హలో.. చానల్ ఎండీ గారేనా?

అవున్సార్.

ఈ సీబీఅయ్ వాళ్ళు కొంచెం హడావుడి చేస్తున్నారు. అదే పాత ఫ్రాడ్ కేస్ గురించి. అందుకని కనీసం నెల రోజులైనా నా న్యూస్ ఎక్కువ కవరేజ్ లేకుండా చూడాలి.

అది మాడ్యూటీ కద్సార్. మీరు వేరే చెప్పాలా? మీ న్యూస్ వచ్చినప్పుడల్లా రేప్ కేసుల గురించీ, కమ్యూ నల్ రైట్స్ గురించీ ఎక్కువ ఫోకస్ చేస్తాం. దాంతో అటేన్షణ్ డైవర్ట్ అయిపోతుంది.

మొత్తం మీ చానల్స్ అన్నిటికీ కలిపి ఎంతకావాలి?

అడివరక్కంటే ఇది పెద్ద ఫ్రాడ్ కద్సార్. వెయ్యి కోట్లైనా ఇవ్వాలి సార్.

సరే.. మామనిషొచ్చి హాండోవర్ చేస్తాడు. 

వెల్కం సార్.

యర్రంశెట్టి సాయి.