మహేశ్ ఆ శృంగారాత్మక నవలను మిస్ అయ్యాడు..!

దర్శకుడు వంశీ సినిమాల్లోకి రాకముందు నుంచే రచయిత అనే విషయం వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఆయన తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తుంటారు. మంచి సాహితీ కారుడిగా కొనసాగుతున్నారు. పసలపూడి కథలు, ఇతర నవలలు, అడదడపా…

దర్శకుడు వంశీ సినిమాల్లోకి రాకముందు నుంచే రచయిత అనే విషయం వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఆయన తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తుంటారు. మంచి సాహితీ కారుడిగా కొనసాగుతున్నారు. పసలపూడి కథలు, ఇతర నవలలు, అడదడపా ఆయన రాసే ఇతర కథలు.. రచయితగా వంశీని ఒక స్థాయిలో నిలబెడతాయి. ప్రత్యేకమైన అభిమాన గణాన్ని ఏర్పాటు చేస్తాయి. చాలా చిన్న వయసులోనే వంశీ కథలు రాయడం ప్రారంభించారట. ఆ కథలే ఆయనకు కొంత గుర్తింపును తెచ్చిపెట్టాయి. సినిమాల కోసం మద్రాస్ రైలెక్కెలేలా చేశాయి. దర్శకుడిగా క్లాసిక్స్ అనదగ్గ సినిమాలను రూపొందించిన తర్వాత కూడా వంశీ తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించాడు. కొన్ని నవలలు రాశాడు. 

అలాంటి వాటిలో ఒకటి ‘‘నళినీ ఆంటీ నీకు ఫోనొచ్చింది’’. 1995 సమయంలో ఆప్పటి ‘‘ఆంధ్రజ్యోతి’’ వీక్లిలో సీరియల్‌గా ప్రచురితం అయ్యింది ఈ నవల. అప్పట్లో వీక్లీలను విస్తృతంగా చదివే వారిని ఒక ఊపు ఊపిన నవల అది. సూపర్ హిట్ అయిన ఆ నవలను సినిమాగా రూపొందించాలని కూడా వంశీ భావించారు. అందుకు ఆయన ఎంచుకున్న హీరో ‘‘మహేశ్ బాబు’’. అప్పటికే చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న కృష్ణ తనయుడిని టీనేజర్‌గా చూపిస్తూ ఆ సినిమాలో డింపుల్ కపాడియాను ప్రధాన పాత్రలో పెట్టి సినిమాను రూపొందించాలని వంశీ అనుకున్నారట. 

ఈ ప్రతిపాదన చాలా వరకూ పట్టాలెక్కింది. అయితే చివరకు ఆగిపోయింది. అప్పటికి చదువుకుంటున్న మహేశ్‌ను డిస్ట్రబ్ చేయడం ఇష్టంలేక కృష్ణ ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ఆ సినిమా ఆగిపోయింది. ఆగి పోవడం విశేషం కాకపోతే ఆ సినిమానే పెద్ద విశేషం అయ్యేది! ఎందుకంటే.. మంచి రసవసత్తర కథ, కథాంశం అది. ఒక ఆంటీకి, ఒక టీనేజ్‌లోని కుర్రాడికి మధ్య సాగుతూ రసపట్టులా ఉంటుంది ఆ కథనం. భర్తను దారిలో పెట్టుకోవడానికి ఆ ఆంటీ కుర్రాడిని రెచ్చగొట్టడం.. వారి ప్లేటోనిక్ లవ్… టచ్ చేసుకోకుండానే కావాల్సినంత శృంగారం.. అన్నట్టుగా ఉంటుంది ఆ నవల. 

మరి అలాంటి శృంగారాన్ని పేపర్‌పై చిలికించిన  వంశీ తెరపై కూడా డింపుల్  కపాడియా-మహేశ్‌ల మధ్య ఒలింకించి ఉంటే…. అదో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయేది! కానీ కృష్ణ దానికి అవకాశం ఇచ్చినట్టు లేరు. అలా ఆ సబ్జెక్టు.. కనుమరుగయ్యింది. పాత మ్యాగ్జిన్లలో మాత్రం దాని ఘాటు తగ్గదండోయ్!