పవన్‌ హటావో.. పవన్‌ ఫ్యాన్‌.!

నేను పవన్‌కళ్యాణ్‌కి వీరాభిమానిని.. అయినాసరే పవన్‌కళ్యాణ్‌ హఠావో.. పాలిటిక్స్‌ బచావో.. అంటున్నాడు బొగ్గుల శ్రీనివాస్‌ అనే ఓ రచయిత. ‘పవన్‌కళ్యాణ్‌ హఠావో’ పేరుతో ఓ పుస్తకాన్ని రాసిన బొగ్గు శ్రీనివాస్‌, ప్రస్తుత బురద రాజకీయాల్లో…

నేను పవన్‌కళ్యాణ్‌కి వీరాభిమానిని.. అయినాసరే పవన్‌కళ్యాణ్‌ హఠావో.. పాలిటిక్స్‌ బచావో.. అంటున్నాడు బొగ్గుల శ్రీనివాస్‌ అనే ఓ రచయిత. ‘పవన్‌కళ్యాణ్‌ హఠావో’ పేరుతో ఓ పుస్తకాన్ని రాసిన బొగ్గు శ్రీనివాస్‌, ప్రస్తుత బురద రాజకీయాల్లో తానూ ఆ బురదను వంట పట్టించుకుంటున్నందునే పవన్‌ని తాను ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించాడు.

పీవీ నరసింహారావుకి కాంగ్రెస్‌లో అన్యాయం జరిగిందన్న విషయం చెబుతూ, చంద్రబాబు కారణంగా స్వర్గీయ ఎన్టీఆర్‌కి అన్యాయం జరిగిన విషయంపై పవన్‌ ఎందుకు ప్రశ్నించడంలేదన్నది బొగ్గుల శ్రీనివాస్‌ వాదన. హైద్రాబాద్‌లో పుస్తక ప్రదర్శన సందర్భంగా తన పుస్తకాల్ని ప్రదర్శన మరియు అమ్మకానికి పెట్టిన బొగ్గుల శ్రీనివాస్‌, పవన్‌ అభిమానులనుంచి తనకు ప్రాణహాని పొంచి వుందని ఆరోపిస్తూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నుంచి రక్షణ కోరారు.

అయితే పవన్‌ అభిమానులు మాత్రం, ఎవరైనా తమ అభిప్రాయాల్ని చెప్పే హక్కు కలిగి వున్నారనీ, బొగ్గుల శ్రీనివాస్‌ ఇందుకు అతీతుడు కాదనీ.. అదే సమయంలో ఎవర్నీ ప్రశ్నించకుండా పవన్‌నే ఆయన ఎందుకు ప్రశ్నిస్తున్నాడో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. పవన్‌ మీద విమర్శలు చేస్తూ, పవన్‌ని టార్గెట్‌ చేస్తూ ‘పవన్‌ హఠావో’ పుస్తకాన్ని రాసినా బొగ్గుల శ్రీనివాస్‌పై పవన్‌ అభిమానులెవరూ దాడి చేసే అవకాశం లేదనీ, ఆ కుసంస్కారం పవన్‌ అభిమానులకు లేదంటూ వపన్‌ అభిమానుల తరఫున భరోసా ఇస్తున్నారు కొందరు.

మొత్తమ్మీద, పవన్‌ పేరుతో బొగ్గుల శ్రీనివాస్‌ పబ్లిసిటీ స్టంట్‌ బాగానే వర్కవుట్‌ అవుతోంది. ఈ పబ్లిసిటీ స్టంట్‌, పవన్‌ హటావో పుస్తకాల సేల్స్‌కి ఉపయోగపడ్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!