ఆర్జీవీ బాధ్యతారాహిత్యం

దర్శకుడు కే బాలచందర్ మరణించినట్లు, దానికి తన సంతాపాన్ని ట్వీట్ చేసి రామ్ గోపాల్ వర్మ మరోసారి తన బాధ్యతారాహిత్యాన్నిబయటపెట్టుకున్నారు. దర్శకుడు బాల చందర్ చెన్నయ్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పలువురు వెళ్లి…

దర్శకుడు కే బాలచందర్ మరణించినట్లు, దానికి తన సంతాపాన్ని ట్వీట్ చేసి రామ్ గోపాల్ వర్మ మరోసారి తన బాధ్యతారాహిత్యాన్నిబయటపెట్టుకున్నారు. దర్శకుడు బాల చందర్ చెన్నయ్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పలువురు వెళ్లి పరామర్శించి వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్టేబుల్ గా వుంది. 

అలాంటి నేపథ్యంలో …ఫీలింగ్ సాడ్ ఫర్ ది పాసింగ్ ఎవే..ట్రూ మావెరిక్ డైకర్టర్…అంటూ ట్వీట్ చేయడం దారుణం. సమాజం పట్ల బాధ్యత కలిగిన వారు ఒక మాట వదిలేటపుడు పరి పరి విధాల ఆలోచించాలి. పెదవి దాటిన మాట పృధ్వి దాటుతుంది అన్న నానుడి వారు తెలుసుకోవాలి. 

గతంలో కూడా వివిధ విషయాలపై, వాటి పర్యవసానాలు, జనాల మనోభావాలు తెలుసుకోకుండా, నా ఇష్టం నాది అనే విధంగా ట్వీట్ చేసి ఆర్జీవీ  విమర్శలపాలయ్యారు. ఈ సారి కూడా అదే జరిగింది. జరిగిన తప్పు తెలుసుకుని, ఆయన తన ట్వీట్ డిలీట్ చేసారు.  బహుశా దీంతో బాలచందర్ కు కీడు పోయి..హాయిగా మరింతకాలం బతకాలని ఆశిద్దాం.