మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకా భలే చిత్రమైన వ్యక్తి. ఆయన వేష, మాట ఎప్పటికిప్పుడు మారుతుంటాయి. ఆయన తాజాగా చెప్పిన సంగతులు భలే గమ్మత్తుగా వున్నాయి. చిరంజీవి 150 వ సినిమాలో తాను కూడా నటిస్తున్నానని ప్రకటించారు. పైగా ఆ సినిమాలో సామాజికన్యాయం, మీడియాపై నిషేధాలు వంటి అంశాల ప్రస్తావన వుంటుందని వెల్లడించారు.
ఇదేదో ఆలు లేదు..చూలూ లేదు..అన్న వ్యవహారంలా వుంది. అసలు కథే సెట్ కాలేదు. ఒకాయన ఫస్ట్ హాఫ్ వండాడు..మరొకాయన ఇంకా కథాచర్చల్లోనే వున్నాడు. అప్పుడు ఇందులో చొప్పించాల్సిన అంశాలు, అందులొ ఓ అప్పుడే ఓ క్యారెక్టర్ కు నటుడి సెలక్షన్ అంటే భలే కామెడీగా లేదూ….అయినా ఆనం వివేకా చేసేది, చెప్పేది ఎప్పుడూ కామెడీగానే వుంటుందిగా.