Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జూ.ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ కాంబినేషన్‌లో..

జూ.ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ కాంబినేషన్‌లో..

జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రానుందట. ఈ సినిమా కోసం దర్శకుడు సురేందర్‌రెడ్డి ఎప్పుడో స్క్రిప్ట్‌ రెడీ చేసుకున్నాడట. కొన్ని కారణాలతో ఆ సినిమా ఇప్పటిదాకా వర్కవుట్‌ అవలేదుగానీ, అతి త్వరలోనే కళ్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కలిసి తెరపై కన్పిస్తారనీ, సురేందర్‌రెడ్డి డేట్స్‌ దొరకడమే ఆలస్యమనీ టాలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.

హీరోగా సినిమాలు చేస్తూనే, నిర్మాతగా రాణిస్తున్నాడు కళ్యాణ్‌రామ్‌. బాలకృష్ణతో ఓ సినిమా నిర్మించేందుకు కళ్యాణ్‌రామ్‌ సన్నాహాలు చేస్తోన్న విషయం విదితమే. అలాగే, జూనియర్‌ ఎన్టీఆర్‌తోనూ సినిమాలు చేయాలనుకుంటున్నాడు కళ్యాణ్‌రామ్‌. అలా చేసే సినిమాల్లో ఒకటి జూనియర్‌ ఎన్టీఆర్‌తో, స్క్రీన్‌ షేర్‌ చేసుకునేలా వుండాలని కళ్యాణ్‌రామ్‌ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. తమ్ముడితో కలిసి చేసే సినిమా సెన్సేషనల్‌ హిట్‌ అయ్యేలా వుండాలన్నది అన్నయ్య కళ్యాణ్‌రామ్‌ భావన.

స్వర్గీయ నందమూరి తారకరామారావు నటించిన పౌరాణిక సినిమాల్లో దేన్నయినా తమ కాంబినేషన్‌లో రీమేక్‌ చేస్తే ఎలా వుంటుందన్న ఆలోచనతోపాటు, స్వర్గీయ ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన సాంఘిక చిత్రాలపైనా కళ్యాణ్‌రామ్‌ కన్నేసి వున్నాడట. అదే సమయంలో సురేందర్‌రెడ్డి దగ్గర వున్న సబ్జెక్ట్‌ కూడా కళ్యాణ్‌రామ్‌కి బాగా నచ్చేసిందట. మంచి టైమ్‌ చూసి, ఈ కాంబినేషన్‌ గురించి అధికారికంగా ప్రకటించాలని కళ్యాణ్‌రామ్‌ అనుకుంటున్నాడట. ఆ రోజు కోసం నందమూరి ఫ్యాన్స్‌ ఉత్కంఠగా ఎదురు చూడాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?