హైద్రాబాద్‌లో మకాం సరే, తెలుగు సినిమాల్లో ఎప్పుడో.!

పదిహేనేళ్ళ కల నెరవేరిందంటూ ట్వీటేసింది బాలీవుడ్ క్యూట్ భామ అలియా భట్. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో బాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన ఈ అందాల భామ, ఇపడు బాలీవుడ్‌లో హాట్ ఫేవరెట్. తెలుగు సినిమాల్లో…

పదిహేనేళ్ళ కల నెరవేరిందంటూ ట్వీటేసింది బాలీవుడ్ క్యూట్ భామ అలియా భట్. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో బాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన ఈ అందాల భామ, ఇపడు బాలీవుడ్‌లో హాట్ ఫేవరెట్. తెలుగు సినిమాల్లో నటించాలని వుందంటూ ఆ మధ్య ఓ సినిమా ప్రమోషన్ కోసం హైద్రాబాద్‌కి వచ్చిన సమయంలో స్టేట్‌మెంట్ దంచేసింది. కానీ, తెలుగు సినిమా నుంచి ఆఫర్లు వస్తున్నా, డేట్లు లేవు.. రెమ్యునరేషన్ సరిపోదు.. అంటూ తప్పించుకుంటోందట.

 ఇంతకీ, అలియాభట్ నెరవేర్చుకున్న కల ఏంటో తెలుసా.? పదిహేనేళ్ళ తర్వాత కుటుంబమంతా కలిసి ‘వేకేషన్’కి వెళ్ళడం. అది కూడా హైద్రాబాద్‌లోని గ్రేట్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కావడం ఇంకో విశేషం. ఇటీవలే ఓ సినిమా షూటింగ్‌లో గాయపడ్డంతో అలియాభట్ విశ్రాంతి తీసుకోక తప్పడంలేదు డాక్టర్ల సూచన కారణంగా. హైద్రాబాద్ వెకేషన్‌లో, అలియాభట్ నగరమంతా చుట్టేయాలనుకుంటోందట. 

రంజాన్ మాసం కారణంగా, హైద్రాబాద్ ధగధగ మెరిసిపోతుంటుంది. ఆ అందాల్ని ఈ అందాల భామ తిలకించడం సంగతి అటుంచితే, అలియాభట్‌తో సినిమా చేయడానికి రెడీగా వున్న టాలీవుడ్ నిర్మాతలు, ఆమెను కలిసేందుకు విశ్వ ప్రయత్నాలూ చేస్తున్నారట. తెలుగులో ఓ యంగ్ హీరో, అలియాభట్‌తో సినిమా చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నాడంటూ చాన్నాళ్ళుగా ఊహాగానాలు విన్పిస్తున్నాయి. అలియా హైద్రాబాద్ టూర్‌లో ఆ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ పడుతుందేమో వేచి చూడాల్సిందే.