రాజమౌళి..బాహుబలి ఇప్పుడు ప్రభాస్ ను ఇంటర్నేషనల్ స్టార్ గా మార్చేస్తోంది. బాహుబలి టూ, త్రీ తరువాత ప్రభాస్ మహా అయితే ఒక్క తెలుగు సినిమా మాత్రమే చేసే అవకాశం వుంది. అది యువి క్రియేషన్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నది. ఇది కూడా మల్టిపుల్ లాంగ్వేజీ సినిమా అవుతుంది.
అది కాక, ఇప్పుడు ప్రభాస్ ముందుకు రెండు హాలీవుడ్ ఆపర్లు వచ్చినట్లు వినికిడి. ఒక సినిమాలో జాకీ చాన్ కీలకపాత్రధారి. ప్రభాస్ కు కూడా తగు ప్రాధాన్యం వున్న పాత్ర వుంటుంది. అలాగే మరో సినిమా నేరుగా ప్రభాస్ తోనే. అయితే ఈ రెండు ప్రాజెక్టులు ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే వున్నాయి.
హాలీవుడ్ సినిమాలకు ఆసియన్ మార్కెట్ చిన్నదేమీ కాదు. అందుకే సబ్జెక్ట్ లో చైనా, భారత్ తదితర వ్యవహారాలు, ఇక్కడి నటులకు కాస్త అవకాశాలు ఇస్తుంటారు. అయిదువందల కోట్లు బాహుబలి వసూలు చేసిందంటే, అది హాలీవుడ్ తో సమానమే. అదే నేరుగా హాలీవుడ్ లో తీస్తే, వారికి భారత్ మంచి మార్కెట్ అవుతుంది. అందుకే ప్రభాస్ కు ఇప్పుడు అవకాశాలు తలుపుతడుతున్నట్లు వినకిడి.