నిఖిల్ కు రెండు బంపర్ ఆఫర్లు

స్వామిరారా, కార్తికేయ రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్ లు కొట్టడం కాదు కానీ, హీరో నిఖిల్ వైపు చూస్తున్నారు కాస్త డిఫరెంట్ ఐడియాలున్నజనం. అందులో ఉయ్యాల జంపాల సినిమా అందించిన విరించి ఒకరు.…

స్వామిరారా, కార్తికేయ రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్ లు కొట్టడం కాదు కానీ, హీరో నిఖిల్ వైపు చూస్తున్నారు కాస్త డిఫరెంట్ ఐడియాలున్నజనం. అందులో ఉయ్యాల జంపాల సినిమా అందించిన విరించి ఒకరు. ఆయన ప్రస్తుతం నిఖిల్ తో కథా చర్చల్లో వున్నారు. 

ఇక ఏస్ స్టోరీ టెల్లర్ కమ్ రైటర్ కోనవెంకట్ ఇటీవల కొంతకాలం యుఎస్ లో వుండి వచ్చారు. అక్కడ వున్నపుడు నిఖిల్ కోసమే ఓ మాంచి కథ తయారుచేసారట. అది చెబుతా అని నిఖిల్ ను అడిగినట్లు బొగట్టా. ఒకటి రెండు రోజుల్లో ఈ డీల్ కూడా ఫైనల్ అయ్యే అవకాశం వుంది. ఇలా మొత్తం మీద నిఖిల్ కు మంచి రోజులు స్టార్ట్ అయినట్లున్నాయి.