సిడ్నీ ఆపరేషన్‌ సక్సెస్‌.!

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఐసిస్‌ టెర్రరిస్ట్‌ ఓ కేఫ్‌లో కొందర్ని బందీలుగా చేసుకుని 16 గంటలుగా తీవ్ర ఉత్కంఠకు తెరలేపిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా భద్రతాదళాలు పక్కా వ్యూహంతో ‘ఆపరేషన్‌’ చేపట్టారు. 16…

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఐసిస్‌ టెర్రరిస్ట్‌ ఓ కేఫ్‌లో కొందర్ని బందీలుగా చేసుకుని 16 గంటలుగా తీవ్ర ఉత్కంఠకు తెరలేపిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా భద్రతాదళాలు పక్కా వ్యూహంతో ‘ఆపరేషన్‌’ చేపట్టారు. 16 గంటలపాటు తీవ్రంగా శ్రమించిన ఆస్ట్రేలియా భద్రతాదళాలు ఎలాగైతేనేం.. ఆపరేషన్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముగించాయి.

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన గుంటూరు వాసి విశ్వకాంత్‌రెడ్డి ఈ ఆపరేషన్‌లో క్షేమంగా బయటపడ్డాడు. దాంతో కుటుంబ సభ్యుల్లో ఇప్పటిదాకా నెలకొన్న టెన్షన్‌ నుంచి రిలీఫ్‌ పొందారు. తమ కుమారుడు క్షేమంగా వున్నాడని, ఈ మేరకు ఆస్ట్రేలియా అధికారుల నుంచి తమకు సమాచారం అందిందని విశ్వకాంత్‌ కుటుంబ సభ్యులు వెల్లడించారు.

మరోపక్క, ఈ ఆపరేషన్‌లో ఇద్దరు లేదా ముగ్గురు బందీలకు చిన్నపాటి గాయాలైనట్లు తెలుస్తోంది. తీవ్రవాదిని హరూన్‌ మొనిన్‌గా గుర్తించారు. ఇరాన్‌కి చెందిన ఈ వ్యక్తిపై గతంలోనూ అనేక కేసులు వున్నట్లు ఆస్ట్రేలియా పోలీసు అధికారులు చెబుతున్నారు.