ఖయ్యామ్ కు ప్రమోషన్

కమెడియన్ లకు ఓ రోజు అంటూ వుంటుంది. అంతే కొడ్తే వెళ్లి హీరో సీట్లో పడతారు. రాజబాబు దగ్గర నుంచి సునీల్ వరకు ఎందరి విషయంలోనో రుజువైన సత్యం. ఇప్పుడు అన్న ఆలీ మాదిరిగానే…

కమెడియన్ లకు ఓ రోజు అంటూ వుంటుంది. అంతే కొడ్తే వెళ్లి హీరో సీట్లో పడతారు. రాజబాబు దగ్గర నుంచి సునీల్ వరకు ఎందరి విషయంలోనో రుజువైన సత్యం. ఇప్పుడు అన్న ఆలీ మాదిరిగానే తమ్ముడు ఖయ్యామ్ కూడా హీరో అయిపోతున్నాడు. 

అడపా దడపా చిన్నచిన్నపాత్రల్లో కనిపించిన ఖయ్యామ్ హీరోగా ఓ సినిమా తెరకెక్క బోతోంది. ఈ సినిమాకు కేదారేశ్వర రెడ్డి దర్శకుడు.  షేక్ అల్లాబక్షు నిర్మాత. సంచితా పడుకునే హీరోయిన్ గా నటించే ఈ సినిమా పూర్తిగా వినోదాత్మకంగా నడిచే లవ్ స్టోరీ. మరి ఈసినిమా ఖయ్యామ్ ను ఓ స్టేజ్ కు తీసుకెళ్తుందేమో చూడాలి.