చాలా కాలంగా విడుదల కాకుండా ఆగిపోయి ఉన్న ‘రేయ్’ దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడేసింది. గతంలోను పలు చిత్రాల విషయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ వాటిని విడుదల చేసి, హిట్ చేసి తిరిగి ట్రాక్ మీదకి వచ్చేసాడు చౌదరి. కానీ ‘రేయ్’ అతడికి తలకి మించిన భారంగా మారింది.
ఈ చిత్రంపై ముప్పయ్ కోట్ల పైగానే పెట్టుబడి పెట్టడంతో బిజినెస్ జరగడం లేదు. రీసెంట్గా సాయి ధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా కూడా రిలీజ్ అయింది. ఆ చిత్రంతో హీరోకి మంచి ఫీడ్బ్యాక్ రావడంతో మళ్లీ చౌదరిలో ఆశలు చిగురించాయి. రేయ్ని రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు మళ్లీ మొదలు పెట్టాడు.
జనవరి 30న ఈ చిత్రం రిలీజ్ అవుతుందని ప్రచారం స్టార్ట్ అయింది. అయితే డేట్ అనౌన్స్ చేసినంత ఈజీగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేయడం కుదర్దు. ఈసారైనా చౌదరి కష్టాలు తీరిపోయి రేయ్ వెలుగు చూస్తుందో లేదో మరి.