బాలయ్య సినిమాలకు హీరోయిన్లు ఎప్పుడూ సమస్యే. ఎవర్ని అనుకున్నా ఏదో సమస్య వస్తుంటుంది. గడచిన రెండు మూడు రోజులుగా కిందా మీదా పడి ప్రణీతను ఫైనల్ చేస్తే అది కాస్తా మళ్లీ తుస్సుమంది. మరి చేయడానికి ఆమె ఒప్పుకోలేదో, ఇంకోటో తెలియదు కానీ, రెమ్యూనిరేషన్ ఎక్కువ అడుగుతోందన్న కారణం చెబుతూ, రాధిక ఆంప్టే ను ఎంపిక చేసారని తాజా సమాచారం.
లెజెంట్ హిట్ సెంటిమెంట్ కూడా ఇక్కడ కారణంగా చూపుతున్నారు. నిజానికి అదే కారణం అనుకుంటే, ముందుగానే ఆమెను ఎంపిక చేసుకునేవారు. అంతకన్నా సెంటిమెంట్ బలంగా వున్న నయనతారను ఎంపిక చేసేవారు. రోటీన్ పెయిర్ అయిపోతుందని త్రిష మాదిరిగానే సెకెండ్ హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి వుండాలనుకున్నారు అందుకే ప్రణీతను ఓకె చేసారు.
కానీ తీరా ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. అది ఎందుకున్నదే తెలియదు. రెమ్యూనిరేషన్ అన్నది యూనిట్ వర్గాల సమాచారం. బాలయ్య సినిమా అన్నపుడు ఆ మాత్రం ఖర్చుకు జంకుతారా..ఇంకేదో వుందని గుసగుసల సారం.