సినిమా చూపిస్త మామా

వురే..అప్పోజీ…తమిళ సినిమా జనాలు గొప్పొళ్లురా బాబూ… Advertisement హేయ్..నువు కూడా యేస్సేవ్ రా గోపాలం.. యేసీడం కాదెహె..అసలు వాళ్లు సినిమా తీస్తే ఓ లెక్కలో వుంటుంది కదా అవును..నిజమే. రెండు అందాల లాభం ఆళ్ల…

వురే..అప్పోజీ…తమిళ సినిమా జనాలు గొప్పొళ్లురా బాబూ…

హేయ్..నువు కూడా యేస్సేవ్ రా గోపాలం..

యేసీడం కాదెహె..అసలు వాళ్లు సినిమా తీస్తే ఓ లెక్కలో వుంటుంది కదా

అవును..నిజమే. రెండు అందాల లాభం ఆళ్ల సినిమా…

అయితే మన సినిమా ఎంత కిందకి వుందో చెబుతారు..

లేదా మన సినిమాలు ఎంత బెటరో చెబుతారు..

ఇంతకీ సికిందర్ బొమ్మ ఎలా వుందంటావ్

నాగార్జున నాలుక్కరుచుకునేలా వుంది

మధ్యలో ఆయనెందుకు వచ్చాడు

మరి ఆయనే కదా..లింగుస్వామి ఊ..అంటే మళ్లీ సైకిల్ చైన్ తెంపుతా..తెంపుతా అన్నాడు ఓపెన్‌గా.

బాగుంది. పెద్ద డైరట్టర్ కదా..ఓ సినిమా చేద్దారి అని ఆశ..ఎవరికి మాత్రం వుండదేటి?

ఇప్పుడు సికిందర్ చూసాక కూడా వుంటుందంటావా?

ఇప్పుడేవైపోయిందని అలాగనేస్తున్నావ్..సమంత చూసావా..ఎట్టా చూపించిందో?

అవును మరి. సినిమాలో ఇంకేం చూపిండానికి లేదు కదా?

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి..మన బ్రహ్మానందం సార్ ని తమిళపోళ్లు కూడా గుర్తించారు.

అవును మరి. కానీ సినిమాలో కామెడీ చూసి, మనేక డౌట్ వచ్చింది. చేసింది ఆయనేనా అని?

యువన్ శంకర్ రాజా సూఫీ స్టయిల్‌లో డ్యూయట్ చేసాడు విన్నావా..సూపర్ కదా..

అవును ఈ మధ్యనే ఇక్కడి నుంచి అక్కడికి మారాడు కదా..కొత్త రాగాలు నేర్చుకుంటున్నాడు.

ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఫైట్లు మాత్రం సూపర్ రా..

తీసింది అందుకేగా..ఫైట్ల మధ్యన కథ అల్లారు. అందుకే సికిందర్ బదులు ఫైటర్ అని పెట్టి వుంటే బాగుండేది

అయినా సమంతను అలా సెకండాఫ్ అంతా ముసుగులో వుంచీడం నాకు నచ్చలేదు రా..

అందుకే కదా..ముసుగు తీసినపుడల్లా..దాంతో పాటు అన్నీ తీసేసింది

పాపం..గౌతమ్ మీనన్ ఇప్పుడు సమంతను చూస్తే ఏమనుకుంటాడ్రా

సమంతకు నిండా చీరకట్టి, తాను బతికిపోయాను అనుకుంటాడు.

అయినా ‘తిరుపతి’ బ్రదర్స్ భలే భారీ సినిమాలు తీస్తార్రా

అవును మరి డిస్టిబ్యూటర్‌లు 70 కోట్ల ‘ముడుపు’లు కట్టారు కదా..

ముడుపంటే గుర్తొచ్చింది..మన లగడపాటి బాబు కూడా 13 కోట్లకు కొన్నాడట కదా బొమ్మ. 16కు అమ్మేసి ఒకటో రెండో లాభం చేసుకున్నాడట కదా?

వురే..తెలీకుండా అనీకు..అమ్మడం నువు చూసావా..ఇప్పుడు డబ్బులు యెనక్కు ఇమ్మని కొన్నోళ్లు అడుగుతున్నారని చెబుతుంటే నువు విన్నావా..అందుకే 13లో కొంతయినా వెనక్కు ఇమ్మని అడుగుతున్నాడట తిరుపతి బ్రదర్స్‌ను

హుండీలో పడిన డబ్బులు యెనక్కు వస్తాయంటావా? తెలియక కొనేసాడ్రా

తెలియక కాదు..తెలుసుకోక..బొమ్మ సూపరనుకుంటే లింగుసామి, తిరుపతి బ్రదర్స్, స్టూడియో గ్రీన్..వదుల్తారా..తెలుగులో కూడా ఆళ్లే దిగిపోతారు..వాళ్లు వదిలేసినపుడే తెలిసిపోయిది రిజల్టు.

భలే లాజిక్ పట్టావ్ రా..ఇంతకీ మన మారుతి భయ్యా బొమ్మ ఎలా గుందేటి?

మారుతి భయ్యా బొమ్మంటే డైరట్టర్ హరినాధ్ కు కోపం వచ్చీగల్దు.

కథ మాటలు మారుతి భయ్యావే కదా..

డైరక్షన్ ఆయన్ది కాదు కదా..లవర్స్ అంటే జంట కదా..

అందుకేనేటి సినిమాలో ఫస్టాఫ్ లో సుమంత్ అశ్విన్, సెకండాఫ్‌లో సప్తగిరి హీరోలుగా చేసీసారు..

పోనీ లవర్స్ బాగున్నారంటావా..

ఎలా బాగుంటార్రా..అశ్వినేమో..సన్నగా వుంటాడా..నందిత ఏమో కాస్త భారీగా వుంటదా?

మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదంటావా?

అది మాడ్ ఫర్ ఈచ్ అదరెహె..సెకండాఫ్ చూడ్నేదా..అంతా పిచ్చోడి గోల..

మారుతి భయ్య..హరినాథ్ బాబు కూడా మ్యాడ్ ఫర్ ఈచ్ అదరన్నమాట..అందుకే కలిసి సినిమా చేసేసారు..

మారుతికి ఇలాంటి మ్యాడ్ జోడీలు ఇంకా మరో ఒకటి రెండున్నాయట.

అంటే మనం చూడాల్సిన ‘సిత్రాలు’ ఇంకా చాలా వున్నాయన్నమాట.

అంతేగా..చూసినవాటి సంగతి సరే కానీ, మన సచిన బాబు బొమ్మ వచ్చేవారం వచ్చేస్తోంది..చూద్దారి పద..

‘చిత్ర’గుప్త