ప్రణీత ట్రబులిస్తుందా?

హీరోయిన్ ప్రణీత ఆటిట్యూడ్ మీద టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజగా ఆమె బాలయ్య బాబు డిక్టేటర్ సినిమా నుంచి బయటకు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు శ్రీవాసు దర్శకుడు. ప్రణీత సినిమాలను…

హీరోయిన్ ప్రణీత ఆటిట్యూడ్ మీద టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజగా ఆమె బాలయ్య బాబు డిక్టేటర్ సినిమా నుంచి బయటకు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు శ్రీవాసు దర్శకుడు. ప్రణీత సినిమాలను టేకిటీజీగా తీసుకుంటోందని ఇండస్ట్రీ టాక్. 

ఆ మధ్య ఓ సినిమాలో హీరోయిన్ గా చేసినపుడు సెట్ పైకి లేట్ గా వచ్చేదట…ఏమిటి అని అడిగితే, అసిస్టెంట్ వచ్చి లేపలేదని సమాధానం అంట..అదేంటీ అని అసిస్టెంట్ ను అడిగితే అయిదు నుంచి ప్రారంభిస్తే ఏడు గంటలకు లేస్తారని సమాధానం అంట. 

ఇదిలా వుంటే కమెడియన్ నుంచి హీరోగా మారిన ఓ స్టార్ పక్కన నటిస్తా అని చాలా సార్లు రిక్వెస్టు చేసిందట. తీరా, సునీల్ తో ఓకె చేయించి, ప్రణీతను కాంట్రాక్టు చేయడం ప్రారంభిస్తే నో రిప్లయ్ అంట. ఇలా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. నిజమ కాదా అన్నది పక్కన పెడితే, ఇండస్ట్రీలో ఆటిట్యూడ్ పై గుసగుసలు, ఎవరి కెరీర్ కు అంత మంచిది కాదు.