ఫ్యామిలీ కథలే అందరివీ

ఇప్పుడు నడుస్తున్నది ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సీజన్. అందుకనే అందరు హీరోలు అదె బాట పడుతున్నారు. నిన్నటి దాకా ఓన్లీ ఎంటర్ టైన్ మెంట్. ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్.  మంచు…

ఇప్పుడు నడుస్తున్నది ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సీజన్. అందుకనే అందరు హీరోలు అదె బాట పడుతున్నారు. నిన్నటి దాకా ఓన్లీ ఎంటర్ టైన్ మెంట్. ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్.  మంచు బ్రదర్స్ కూడా ఇప్పుడు ఇదే హడావుడిలో వున్నారు. ఫిల్మ్ సిటీలో విష్ణు ఎర్రబస్సు, తిరుపతిలో మనోజ్ కరెంటు తీగ షూటింగ్ లు వీర బిజీగా జరుగుతున్నాయి. 

ఈ రెండింటి కథలు కూడా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ ప్రధానమైనవేనట. ఇక మెగా హీరోలు ముగ్గురు సినిమాలు తెలిసినమే. దిల్ రాజు, సునీల్ కాంబినేషన్ కథ కూడా అలాంటిదే. రామ్ పండగ చేస్కో కూడా అదే టైపు. ఇలా అందరూ కుటుంబ కథా చిత్రాల వైపు మళ్లారు. తప్పదు ఫ్యామిలీలను టీవీల ముందు నుంచి పెద్ద తెర మందుకు తెస్తె తప్ప కలెక్షన్లు రాలవు.