‘అతడే’…ముకుంద?

ముకుంద…మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో వరుణ్ తేజ తొలి సినిమా. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు తరువాత శ్రీకాంత్ అడ్డాల తీస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ సినిమా 25న విడుదలకు…

ముకుంద…మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో వరుణ్ తేజ తొలి సినిమా. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు తరువాత శ్రీకాంత్ అడ్డాల తీస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ సినిమా 25న విడుదలకు రెడీ అవుతోంది. సినిమాకు ప్రచారం కాస్త వీక్ గా వున్నా అంచనాలు బాగానే వున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా కథ కు సంబంధించి రకరకాల గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ముకుంద సినిమా కథ అతడు సినిమాకు కాస్త దగ్గరగా వుంటుందని టాక్.

సినిమా ప్రారంభంలో మర్డర్ జరగడం, హీరో పల్లెటూరికి రావడం, అక్కడ అనుబంధాలు, ఆప్యాయతలు, ఇంతలో పోలీసులు వచ్చి అరెస్టు చేయడం ఇంటర్వెల్ బ్యాంగ్.
అసలు మర్డరేమిటి? ఎందుకు జరిగింది..ఎందుకు చేసారు? ఎవరు చేసారు అన్నది ఫ్లాష్ బ్యాక్, పోస్ట్ ఇంటర్వెల్ ఎపిసోడ్.

అయితే అతడుకు దీనికి తేడా ఏమిటంటే, ఈ సినిమాలో హీరో తాను మర్డర్ చేసానని తొలి నుంచి చెబుతుంటాడు. కానీ ఫ్రెండ్స్ నమ్మరు. జోక్ గా తీసుకుంటారు.
ఇదీ ముకుంద సినిమా కథ గురించి వినిపిస్తున్న గుసగుసల సారాశం. నిజమో కాదో 25 తరువాత తెలుస్తుంది.

ఇదిలా వుంటే హీరో తోలి సినిమా కాబట్టి, భారం అంతా దర్శకుడిపైనే వుందని, సినిమాను వీలయినంత హీరొయిజానికి దూరంగా నడిపారని కూడా తెలుస్తోంది. హీరో ప్లస్ పాయింట్లనే ఎక్కువగా ఫోకస్ చేసినట్లు వినికిడి.