లింగా..రజనీ-రవికుమార్ మాస్ మ్యాజిక్ అవుతుందని అందరూ అనుకున్న సినిమా. ఎందుకంటే వాళ్ల ట్రాక్ రికార్డు అలాంటిది. కానీ ఇప్పుడా సినిమా కాస్తా బాక్సాఫీసు దగ్గర ‘డామ్’ అంది. రజనీ-రవికుమార్ కాంబినేషన్ అని నమ్మకం పెట్టుకుని, రోబో సినిమా కన్నా ఎక్కువ రేట్లు పెట్టి కొన్నారు. అదీ రెండు ఏరియాలు మాత్రమే.
సీడెడ్ ఆరుకోట్లు పెట్టి కొంటే తొలిరోజు కోటి రూపాయిలు పైగా వసూలు చేసింది. వైజాగ్ ఏరియాకు కూడా కోటి ఇరవై వచ్చింది. శని, ఆది వారాలు కూడా ఇదే మాదిరిగా వుంటుందనుకున్నా, మూడు నుంచి మూడు న్నర కోట్లు వస్తుంది. కానీ సినిమా కలెక్షన్లు ఢమాల్ మంటాయని అంటున్నారు. అదే కనుక జరిగే బయ్యర్లు అంతా మరోసారి దెబ్బయిపోవడం గ్యారంటీ అంటున్నారు. అయితే వైజాగ్ పరిస్థితి ఏమిటంటే, వీలయినన్ని ఎక్కువ థియేటర్లలో విడుదలచేయడం. అందువల్ల మూడు రోజుల్లో గట్టెక్కేయచ్చు.
మన రాష్ట్రానికి సంబంధించి ఈరోస్ సంస్థే పెద్ద బయ్యర్ గా వుంది. వైజాగ్ నట్టికుమార్, సీడెడ్ సాయి కొర్రపాటి కొన్నారు. వారు మాత్రం తమ పెట్టుబడి బయటకువచ్చేస్తుందని ధీమాగా వున్నారు. మిగిలిన ఏరియాలు ఈరోస్ స్వయంగా విడుదల చేసుకుంది. కాబట్టి తమిళలాభాలతో సర్దుబాటు చేసుకోవాల్సిందే.