గబ్బర్ 2 కనీసం మరో నెల రోజులు లేటు

పవన్ కళ్యాణ్ విక్రమార్కుడు-భేతాళుడు టైపు వ్యవహారం గబ్బర్ సింగ్ 2. ఈ సినిమా సెట్  మీదకు వెళ్లడానికి ఇంకా కనీసంలో ,…కనీసం..నెల రోజుల పైనే పడుతుందట. దానికి కారణం ఇంకా స్క్రిప్ట్ రెడీ కాకపోవడమే. …

పవన్ కళ్యాణ్ విక్రమార్కుడు-భేతాళుడు టైపు వ్యవహారం గబ్బర్ సింగ్ 2. ఈ సినిమా సెట్  మీదకు వెళ్లడానికి ఇంకా కనీసంలో ,…కనీసం..నెల రోజుల పైనే పడుతుందట. దానికి కారణం ఇంకా స్క్రిప్ట్ రెడీ కాకపోవడమే. 

సంపత్ నంది స్క్రిప్ట్ రిపేర్ అని ఇన్నాళ్లు వినిపిస్తూ వచ్చింది. కాదు..సెంట్రల్ ఐడియా మాత్రం తీసుకుని, బాబి వచ్చే..మొదలాడు అని మళ్లీ మొత్తం స్క్రిప్టు తయారుచేస్తున్నారట. దానికి వారానికో సారో, పక్షానికో సారో..ఇలా వుంటే ఎలా వుంటుంది? అలా వుంటే ఎలావుంటుంది అని డిస్కషన్లు,.దాంతో మళ్లీ కొత్త సీన్లు..ఇలా మూడు అడుగులు ముందుకు..రెండు అడుగులు వెనక్కు పడుతున్నాయట. 

ఇవన్నీపూర్తయి..ఇక చాలు..ఇదే ఫైనల్ స్క్రిప్టు అనడానికి ఇంకో నెలయినా పడుతుందని వినికిడి. అప్పుడు దాని ప్రకారం కాస్టింగ్, టెక్నీషియన్లు..ఆపై లొకేషన్లు..వగైరా..అంటే నెల నుంచి రెండు నెలలు. సో ఇదీ గబ్బర్ సింగ్ 2 అప్ డేట్..మరిన్ని అప్ డేట్లు మరి కొన్నాళ్ల తరువాత.