సంపూ సింగే సాంగ్

సంపూర్ణేష్ బాబు అచ్చమైన తెలుగు హీరో. ఏపనైనా చేసేయగలడు. అందుకే ఇప్పుడు పాట కూడా పాడేసాడు. సంపూ తాజా సినిమా కొబ్బరిమట్ట. ఈ సినిమా అతగాడి మొదటి సినిమా తరువాతే ప్రకటించారు.  Advertisement కానీ…

సంపూర్ణేష్ బాబు అచ్చమైన తెలుగు హీరో. ఏపనైనా చేసేయగలడు. అందుకే ఇప్పుడు పాట కూడా పాడేసాడు. సంపూ తాజా సినిమా కొబ్బరిమట్ట. ఈ సినిమా అతగాడి మొదటి సినిమా తరువాతే ప్రకటించారు. 

కానీ ఇన్నాళ్లు అలా అలా వుంది. కొంత షూట్ జరిగి..కొంత జరగక..ఇలా. ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఓ ఎన్ఆర్ఐ టేకోవర్ చేసారు. దీంతో మళ్లీ కదలిక వచ్చింది. ఇందులో సంపూ ఓ పాట పాడారు. ఈపాటను బుధవారం విడుదల చేస్తున్నారట. మరోసారి సంచలనాలు సృష్టిస్తా అంటున్నాడు సంపూ.  

ఇంతకీ ఈ పాట సినిమాలో పాట కాదు..సినిమా కోసం పాట అని తెలుస్తోంది. అంటే సినిమా ప్రమోషన్ సాంగ్ అన్నమాట. చూడాలి.. సంపూ స్వరం ఏ మేరకు సవరించుకుని, సంచలనాలు నమోదు చేస్తాడో?