నానిన సినిమాతో నానికి తలనొప్పి

ఏ హీరోకి ఇలాంటి కష్టం రాదేమో? అసలే నాని టైమ్ బాలేదు. ఇటీవలికాలంలో ఒక్క హిట్ లేదు. అలాంటి  సమయంలో ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమా రెడీ అయింది. కాస్త పాజిటివ్ బజ్ వుంది.…

ఏ హీరోకి ఇలాంటి కష్టం రాదేమో? అసలే నాని టైమ్ బాలేదు. ఇటీవలికాలంలో ఒక్క హిట్ లేదు. అలాంటి  సమయంలో ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమా రెడీ అయింది. కాస్త పాజిటివ్ బజ్ వుంది. పైగా మంచి బ్యానర్. అశ్వనీదత్ కుమార్తెల స్వప్న సినిమా బ్యానర్. మంచి సినిమాలు చేస్తారన్న ఓ టాక్. ఇలా వస్తున్న సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం. 

21న విడుదల కానుంది. కానీ ఇప్పుడు పాత తప్పులు వెన్నాడి నట్లు నానిని ఇన్నాళ్లు గొడౌన్లొ నానిన ఓ సినిమా ఇబ్బంది పెడుతోంది. జెండాపై కపిరాజు అనే ఓ సినిమా చేసాడు నాని. అది ఇన్నాళ్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఆల్రెడీ తమిళనాట ఫ్లాప్ అని స్టాంప్ వేయించుకుంది. దీన్ని కూడా 21నే విడుదల చేస్తామంటున్నారు సదరు సినిమా నిర్మాతలు. 

ఎంత కాదనుకున్నా కొంతయినా కన్ఫ్యూజన్ వుంటుంది కదా? నాని చెప్పినా మల్టీ డైమన్షన్ జనాలు వినడం లేదట. వాళ్లు అసలే కష్టాల్లో వున్నారు. వాళ్ల కష్టాన్ని హీరోకి, మరో నిర్మాతకు అంటించాలనా వాళ్ల తాపత్రయం. ఏమిటో సుబ్రహ్మణ్యం?