పాపం,మారుతి జాతకం ఏమిటో కానీ, హడావుడి, ఏదో ఒక రగడ లేకుండా సినిమా తయారు కాదు..తయారైనా విడుదలై కూడా ఏదో తకరారు. ఇప్పుడు కొత్త జంట తరువాత సినిమా కోసం పడరాని ఇబ్బందులు పడాల్సి వచ్చింది. హీరోగా సునీల్ రెడీ అన్నాడు. కానీ మళ్లీ నాని వైపు మొగ్గాడు.
కానీ ఇంతలోనే తన సినిమా సంగతేంటని ముందు ఒప్పుకున్న నిర్మాతతో సమస్య. ఇప్పుడు ఆ గొడవ చాంబర్ వరకు వెళ్లి ఆఖరికి సెటిలయింది. ఇక నానితో సినిమా మొదలుకావడమే ఆలస్యం. అల్లు అరవింద్ ఈ సమస్య సెటిల్ మెంట్ కు పుణ్యం కట్టుకున్నట్లు వినికిడి.
ఇప్పుడు ఈ సినిమాని మూడు వంతులు బన్నీవాసు నిర్మిస్తారు. ఆయన కొత్తగా బి ఫిలింస్ అనే బ్యానర్ ను ప్రారంభింస్తున్నారు. నిజానికి యువి క్రియేషన్స్ కూడా నిర్మించే అవకాశం వుంది కానీ, వారికి నాని కాకుండా మరో హీరో అయితే బాగుండును అన్నది ఆలోచనగా వుంది. అందువల్ల బన్నీ వాసే నిర్మాత కావచ్చు.