యువీ బౌలింగ్‌పై ధోనీ కామెంట్‌

గత వరల్డ్‌ కప్‌ హీరో యువరాజ్‌సింగ్‌, ఈ వరల్డ్‌ కప్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో మ్యాజిక్‌ చేసే యువరాజ్‌సింగ్‌, టీమిండియా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. Advertisement…

గత వరల్డ్‌ కప్‌ హీరో యువరాజ్‌సింగ్‌, ఈ వరల్డ్‌ కప్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో మ్యాజిక్‌ చేసే యువరాజ్‌సింగ్‌, టీమిండియా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.

కెప్టెన్‌ ధోనీకీ, యువరాజ్‌సింగ్‌కీ మధ్య వున్న విభేదాల కారణంగానే యువీని సెలక్టర్లు పక్కన పెట్టేశారన్నది ఇప్పటిదాకా విన్పిస్తోన్న గాసిప్స్‌ సారాంశం. తన కొడుక్కి అన్యాయం జరిగిందంటూ యువీ తండ్రి మీడియాకెక్కాడు కూడా. అయితే ధోనీ మాత్రం ‘కూల్‌’గా యువీని సెలక్ట్‌ చేయకపోవడంపై స్పందించాడు.

ఇప్పుడున్న నిబంధనల ప్రకారం చూస్తే, మైదానంలో యువీ బౌలర్‌గా జట్టుకి ఉపయోగపడడన్నది ధోనీ వాదన. కాస్త ఆశ్చర్యకరంగానే వుందిది. యువీ టీమిండియాకి ప్రధాన బౌలర్‌ ఏమీ కాదు. అతను స్ట్రాంగ్‌ బ్యాట్స్‌మన్‌. పిచ్‌ సహకరిస్తే, పార్ట్‌ టైమ్‌ బౌలర్‌గా సత్తా చాటుతాడు తప్ప, యూవీని బౌలర్‌గా ఎలా చూడగలం.? యువీతో పోల్చితే రైనా టీమిండియాకి ప్రస్తుత పరిస్థితుల్లో ఉపయోగపడ్తాడని ధోనీ చెప్పడం చూస్తోంటే, యువీ ఎంపిక కాకపోవడంపై అనుమానాలు పెరుగుతున్నాయి.

ప్రస్తుతం టీమిండియా నాకౌట్‌ దశలోకి అడుగు పెట్టింది. ఈ టైమ్‌లో ధోనీ వీలైనంతవరకు వివాదాలకు దూరంగా వుంటే మంచిది. యువీ గురించి మాట్లాడి ధోనీ కొత్త కష్టాలు కొనితెచ్చుకున్నాడేమో అన్పిస్తోంది. కామెంట్‌ విసిరేయగానే కాదు, దీనిపై మళ్ళీ ప్రశ్నలు వస్తే, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మానసికంగా ఒత్తిడిని అనుభవించాల్సి వస్తుంది ధోనీకి. కోరి వివాదాలు కొనితెచ్చుకోవడమంటే ఇదే మరి.!