రేస్ లోంచి తప్పుకున్న జేమ్స్ బాండ్

అల్లరి నరేష్ లేటెస్ట్ సినిమా జేమ్స్ బాండ్. ఈ నెల 26న విడుదల అని ముందే ప్రకటించారు. కానీ చిత్రంగా ఒక వారం వుందనగా రేస్ లోంచి తప్పుకోవాలని డిసైడ్ అయ్యారు. మరీ భారీ…

అల్లరి నరేష్ లేటెస్ట్ సినిమా జేమ్స్ బాండ్. ఈ నెల 26న విడుదల అని ముందే ప్రకటించారు. కానీ చిత్రంగా ఒక వారం వుందనగా రేస్ లోంచి తప్పుకోవాలని డిసైడ్ అయ్యారు. మరీ భారీ కాంపిటీషన్ ఏమీ లేదు. సందీప్ కిషన్, నాగశౌర్య ల సినిమాలు మాత్రమే వున్నాయి. మరో చిన్న సినిమా వుంది.అయినా కూడా మరెందుకో జేమ్స్ బాండ్ విడుదల వాయిదా పడింది. 

ఆ విషయం ప్రత్యేకంగా ప్రకటించలేదు కానీ, వస్తూందన్న ప్రకటనలు కూడా లేవు. అందుతున్న సమాచారం ప్రకారం రెండు థియేటర్లలో కేరింత వుంది. కృష్ణమ్మ కలిపింది ఇద్దరని ఈ వారం కూడా వుంటుంది. ఈ వారంమరో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. 

అంటే అయిదు సినిమాలు. మరి థియేటర్లతో సమస్య, కాంపిటీషన్. అందుకే నిర్మాత తరువాత విడుదలచేద్దామని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తరువాత అంటే ఇక జూలై ఇరవై నాలుగు తరువాతే అనుకోవాలి.