రుద్రమదేవి..ఎప్పటి నుంచో ఇదిగో అదిగో అంటూ ఊరిస్తోంది. మరీ బాహుబలి మాదరిగా బడ్జెట్ వంద కోటు దాటకున్నా, 70 కోట్ల వరకు ఖర్చు అయింది. అయితే విడుదల చేద్దామంటే ఆర్థిక సమస్యలు, ఇంకా చాలా అడ్డంకులు వచ్చాయి. బాహుబలి ముందు విడుదల చేస్తేనే ఫలితం బాగుంటుంది అని తెలుసు. అయినా కుదరేలేదు.
విజువల్ ఎఫెక్ట్స్ పని పూర్తి కాలేదని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆఖరికి తప్పక బాహుబలి వెనకగా విడదల చేయాలనుకుంటున్నారు. నిజానికి ఇది చాలా రిస్క్. రాజు ను చూసిన కళ్లతో…అన్న సామెతగా వుంటుంది. అయినా కూడా రుద్రమదేవికి మరో ఆప్షన్ కనిపించడం లేదు.
బాహుబలికి మహేష్ శ్రీమంతుడు మధ్య గ్యాప్ లో కన్నా రావాలి..లేదా మరీ వెనక్కన్నా పోవాలి. ఇప్పుడు ఏమీ చేసిది లేక, వర్క్ ఇంకా పూర్తి కాలేదన్న ప్రెస్ నోట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు.