మీనా అడుగుజాడల్లో కూతురు

సినిమా వారి పిల్లలు కూడా ఎక్కువగా వారి తల్లితండ్రుల అడుగు జాడల్లో నడవాలనుకుంటారు. హీరోయిన్ మీనా బాల నటిగా తెరపైకి వచ్చింది. హీరొయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఆపై పెళ్లి చేసుకుంది. బిడ్డను…

సినిమా వారి పిల్లలు కూడా ఎక్కువగా వారి తల్లితండ్రుల అడుగు జాడల్లో నడవాలనుకుంటారు. హీరోయిన్ మీనా బాల నటిగా తెరపైకి వచ్చింది. హీరొయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఆపై పెళ్లి చేసుకుంది. బిడ్డను కన్నది. ఇప్పుడు ఆ కుమార్తె కూడా తల్లి లాగే తెరపైకి వస్తోంది. 

బాలనటిగా ఓ  తమిళ సినిమాలో నటించబొతోంది. ఓ తమిళ సినిమాలో హీరో విజయ్ కూతురుగా చిన్న పాపకు పాత్ర వుందట. దానికి మీనా కుమార్తెను తీసుకున్నారు. అంటే ఇప్పటి నుంచే కెమేరా ముందుకు వచ్చేస్తే, రేపు పెద్దయ్యాక అమ్మంత పెద్ద నటి అయిపోతుందేమో?