బాహుబలి అభిమానులకు సంచలన వార్త. బాహుబలి రెండు భాగాలు కాదు..మూడు భాగాలుగా వస్తోంది. ఈమేరకు దర్శకుడు రాజమౌళి నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆయనే వెల్లడిస్తారు.
బాహుబలికి వచ్చిన అంతర్జాతీయ ఆదరణ, దాని వల్ల ద్వితీయ భాగంలో మార్పులు చేయాల్సి వచ్చిన వైనం కలసి, మూడోభాగానికి దారి తీసాయి. బాలీవుడ్, మళయాల, తమిళ రంగానికి చెందిన కొంతమంది నటులు బాలీవుడ్ టీమ్ లో జాయిన్ అవుతారు. దాంతో కథ స్పాన్ పెరిగింది. ఆ మేరకు పార్ట్ 3 కూడా రూపొందించాల్సి వస్తోంది.
అతి త్వరలో దర్శకుడు రాజమౌళే ఈ విషయాలన్నీ వెల్లడిస్తారు. బాలీవుడ్ నుంచి వచ్చిన స్పందన, ఆ తరువాత వచ్చిన వత్తిడి, ఇవన్నీ కలిసి కథ నిడివిని పెంచినట్లు తెలుస్తోంది. అందుకే మూడో పార్ట్ అవసరమైనట్లు బోగట్టా.